Homeఎంటర్టైన్మెంట్Bellamkonda Sai Srinivas Wedding: తిరుమలలో ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్...

Bellamkonda Sai Srinivas Wedding: తిరుమలలో ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. ఫోటోలు వైరల్..

Bellamkonda Sai Srinivas Wedding: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బాయ్ చెప్పేసాడు. రీసెంట్ గానే ఆయన కావ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన వివాహ మహోత్సవానికి టాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్ హీరోలందరినీ ఆహ్వానించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే నేడు ఆయన వివాహం తెల్లవారు జామున తిరుమల పుణ్య క్షేత్రంలో అత్యంత వైభవంగా, ఎంతో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. పండితుల వేదమంత్రాల సాక్షిగా ఆయన కావ్య మెడలో మూడు ముళ్ళు వేసాడు. తిరుమల క్షేత్రం లోని కర్ణాటక అతిథి భవనం సమీపంలో ఉన్నటువంటి కల్యాణ మండపంలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వంటి వారు ఈ వివాహ వేడుకలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే. అతని తండ్రి బెల్లంకొండ సురేష్ టాలీవుడ్ లోనే టాప్ మోస్ట్ నిర్మాతల్లో ఒకరు. ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకొని , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక పెళ్లి కూతురు కావ్య విషయానికి వస్తే, ఈమె ప్రముఖ లాయర్ కూతురు. ఈమె తాతగారు కూడా హై కోర్టు లో జడ్జీగా పని చేసాడు. హైదరాబాద్ లో బలంగా స్థిరపడిన కుటుంబాల్లో ఒకటి.

ఇక బెల్లకొండ శ్రీనివాస్, కావ్య మధ్య ప్రేమ ఎలా పుట్టడానికి కారణం , శ్రీనివాస్ వాళ్ళ అక్క అట. వాళ్ళ అక్కా క్లాస్ మేట్ గా అప్పుడప్పుడు కావ్య ఇంటికి వస్తుండేది అట. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడడం , అది స్నేహంగా మారడం , కొన్నాళ్ళకు అది ప్రేమగా మారి , ఇలా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే ‘అల్లుడు అదుర్స్’ చిత్రం తర్వాత బాగా గ్యాప్ తీసుకొని ఆయన హిందీలో ఛత్రపతి రీమేక్ తో అరంగేట్రం చేశాడు . ఆ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లోకి ‘భైరవం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ గా నిల్చింది, ఇక ఆ తర్వాత విడుదలైన ‘కిష్కిందపురి’ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇప్పుడు అయన చేతిలో మరో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version