Pawan Kalyan: మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మొదటి సినిమాతోనే ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవాలనే ఉద్దేశ్యం తో తనకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్ ని ఆ సినిమాలో చూపించి తనకంటూ సపరేట్ టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘గోకులంలో సీత’ సినిమా నుంచి వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నాడు.ఇక మద్యలో కొన్ని ప్లాప్ లు వచ్చినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.
ఇప్పుడు జనసేన పార్టీ క్యాంపెనింగ్ చేస్తున్నాడు. ఇక మరో మూడు రోజుల్లో జరిగే ఎలక్షన్స్ లో కీలకపాత్ర వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం కొన్ని కోట్ల సంఖ్యలో అభిమానులైతే ఉన్నారు. ఇక హీరోగా చాలా పీక్ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఆయన సీఎం పదవిని పొందాలని చూస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానుల సంఖ్యతో పోల్చుకుంటే సీఎం పదవి అనేది ఆయనకు చాలా చిన్నదనే చెప్పాలి.
ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నప్పుడు సకల సౌకర్యాలు అన్ని ఉంటాయి. దానికి తోడుగా అభిమానుల అండ కూడా ఉంటుంది. ఇక సీఎం కి ఎంత ఫాలోయింగ్ అయితే ఉంటుందో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి అంతకంటే ఎక్కువ ఫాలోయింగ్ అయితే ఉంది. అయిన కూడా ఆయన సీఎం పదవి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే పేద ప్రజలకు న్యాయం చేయాలంటే సామాన్య మానవుల వల్ల అవదు. దానికి సీఎం అనే ఒక హోదా ఉంటేనే ప్రజలకు వచ్చిన కష్టాలన్నింటిని తీర్చొచ్చు అనే ఉద్దేశ్యంతోనే తను సీఎం పదవి కావాలని ఆశిస్తున్నాడు. అంతే తప్ప తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమైతే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన ఒక సినిమా చేస్తే 200 కోట్ల వరకు అయిన తనకు రెమ్యూనరేషన్ గా ఇచ్చే ప్రొడ్యూసర్లు ఉన్నారు.
మరి ఇలాంటి సమయంలో సంవత్సరానికి రెండు సినిమాలు చేసిన ఆయనకు ఈజీగా 400 కోట్ల వరకు డబ్బులు అయితే వస్తాయి. ఇక అలాగే లగ్జరీ లైఫ్ ఉంటుంది. వాటన్నింటినీ వదిలేసి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అయితే లేదు. కానీ జనాలు పడుతున్న ఇబ్బందులను చూడలేకే తను రాజకీయ ప్రవేశం చేశాడు. మరి ఈసారి పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఆయనకి ఘన విజయం అందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…