Barkha Madan: ఈ విధంగా ఎంతో కష్టపడి స్టార్డం తెచ్చుకున్న కూడా కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే అనుకోకుండా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారు కొంతమంది హీరోయిన్లు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ సైతం ఈ జాబితాకు చెందిన హీరోయిన్. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు చాలా ఆకర్షణ ఏమైనా జీవితాన్ని గడుపుతారు. కానీ తెర వెనుక ఆ హీరోయిన్ల వ్యక్తిగత జీవితం ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో వాళ్లు ఎన్నో సవాళ్లు అలాగే అవమానాలను ఎదుర్కొని తమ నటనతో గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతారు. కెరియర్ వరుస అవకాశాలతో బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే సినిమా ఇండస్ట్రీకి అనుకోకుండా దూరంగా ఉండిపోతారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలను వదిలేసిన ఈమె ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. అప్పట్లో వరుస సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ గ్రామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసిగా మారిపోయింది.
Also Read: నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
ప్రస్తుతం పర్వతాలలో నివాసం ఉంటుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు బర్కా మదన్. ఈమె 1996లో రిలీజ్ అయిన ఖిలాడీ యో క కిలాడి అనే సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, రేఖ మరియు రవీనా టండన్ ప్రధాన పాత్రలలో నటించడం జరిగింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బర్కా మద న్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. తన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత మరో అవకాశం అందుకోవడానికి ఆమెకు ఏకంగా ఏడు ఏళ్లు పట్టింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన హారర్ సినిమా భూత్ లో మంజీత్ కోసుల అనే భయానక పాత్రలో ఈమె నటించిన.
ఈ సినిమా 2003లో రిలీజ్ అయ్యి ఆమె నటనకు మంచి ప్రశంసలు తెచ్చి పెట్టింది. భూత్ సినిమాలో అజయ్ దేవగన్, రేఖ, నానాపటేకర్, తనూజ ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమా తర్వాత బర్క బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆమె జీ టీవీలో 2005 నుంచి 2009 వరకు వచ్చిన సాత్ వేరే సలోని సఫర్ అనే సీరియల్ లో కనిపించింది. ఆమె నిర్మాతగా మారాలని భావించి 2010లో గోల్డెన్ గేట్ ఎల్.ఎల్.సిని కూడా స్థాపించింది. తన సొంత బ్యానర్ పై బర్కా సోచ్, సురకాబ్ అనే రెండు సినిమాలను నిర్మించడం జరిగింది. 2012లో ఆమె బౌద్ధమతంలోకి మారాలని నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల నుంచి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సన్యాసిగా జీవితం సాగిస్తుంది.