Bangarraju: ‘బంగార్రాజు’కు అది కూడా కలిసి రానుందా?

Bangarraju: కరోనా పరిస్థితుల కారణంగా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన సినిమాలన్నీ పడ్డాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘బీమ్లానాయక్’ సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం థియేటర్లలో కళ తప్పింది. ఈసారి సంక్రాంతికి అన్ని చిన్న సినిమాలే విడుదలయ్యాయి. అయితే వీటిలో నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే పెద్ద హీరో సినిమాగా రిలీజు కావడం విశేషం. నాగార్జున-నాగచైతన్య కాంబోలో వచ్చిన ‘బంగార్రాజు’ తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘బంగార్రాజు’ సంక్రాంతికి ఫర్పెక్ట్ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 16, 2022 9:54 am
Follow us on

Bangarraju: కరోనా పరిస్థితుల కారణంగా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన సినిమాలన్నీ పడ్డాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘బీమ్లానాయక్’ సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం థియేటర్లలో కళ తప్పింది. ఈసారి సంక్రాంతికి అన్ని చిన్న సినిమాలే విడుదలయ్యాయి. అయితే వీటిలో నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే పెద్ద హీరో సినిమాగా రిలీజు కావడం విశేషం.

నాగార్జున-నాగచైతన్య కాంబోలో వచ్చిన ‘బంగార్రాజు’ తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘బంగార్రాజు’ సంక్రాంతికి ఫర్పెక్ట్ మూవీ అనిపించుకుంది. నాగార్జున ఈ సినిమా కథపై నమ్మకంతో కరోనా సమయంలోనూ ధైర్యంగా విడుదల చేయడం ‘బంగార్రాజు’కు బాగా కలిసొచ్చింది.

పెద్ద సినిమాలేవీ లేకపపోవడంతో ‘బంగార్రాజు’ దాదాపు 800 థియేటర్లలో రిలీజైంది. అయితే కరోనా కారణంగా కలెక్షన్లపై ప్రభావం పడుతుందని అంతా భావించారు. అయితే వాటన్నింటినీ ‘బంగార్రాజు’ పటాపంచలు చేసేశాడు. మొదటి రెండ్రోజులు ఈ మూవీ భారీగా కలెక్షన్లు రాబట్టింది. మూడోరోజు కూడా కలెక్షన్లు భారీగానే వచ్చేలా కన్పిస్తుంది.

ఈ సినిమాను సంక్రాంతి రిలీజు చేయడం ‘బంగార్రాజు’ విషయంలో బాగానే వర్కౌట్ అయింది. ఈ సినిమా నాగార్జున కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. 39కోట్ల బిజినెస్ లక్ష్యంగా బరిలో దిగిన ఈ మూవీ తొలి వారంలోనే ఆ కలెక్షన్లను రాబట్టేలా పరుగులు పెడుతోంది. దీంతో చిత్రబృందం హ్యాపీగా ఫీలవుతోంది.

ఈ మూవీలో నాగార్జున, నాగచైతన్య ఫార్మమెన్స్ కు అక్కినేని ఫ్యాన్ ఫిదా అవుతున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి, ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. అనుప్ రూబెన్ సమకూర్చిన బాణీలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సంక్రాంతి తర్వాత ప్రభుత్వం సెలవులు పొడగించడం కూడా ‘బంగార్రాజు’కు కలిసొచ్చే అంశంగా మారింది.