పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన తనకు దైవంతో సమానమని ఎన్నోసార్లు మీడియా వేదికగా పేర్కొన్నారు బండ్ల. ఇప్పటికే పవన్‌తో కలిసి రెండు సినిమాలను చేశారు. ‘తీన్ మార్, గబ్బర్ సింగ్’ వంటి సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవరించారు. అయితే తీన్ మార్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా.. గబ్బర్ సినిమా మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
Also Read : ఆకట్టుకుంటున్న మామాకోడళ్ల ముచ్చట్లు !
అనంతరం అటు బండ్ల గణేష్, ఇటు పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ ఇప్పటికే ఫుల్లుగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటు బండ్ల గణేష్ కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. అలాగే బండ్ల గణేష్ క్యారెక్టర్‌కు మంచి మార్కులు పడ్డాయి.
పవన్ తన దేవుడిగా ఎప్పుడూ చెప్పుకునే బండ్ల గణేశ్ ముచ్చటగా మూడోసారి పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయబోతున్నాడట. ఈ విషయాన్ని గణేష్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు. ‘నా బాస్ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు’ అని మెసేజ్‌తోపాటు పవన్‌కల్యాణ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
వీరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా తెరకెక్కనుంది..? ఎవరు డైరెక్ట్ చేస్తారు..? అనే అంశాలు ఇప్పుడు పవన్ అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. 2015లో విడుదలైన టెంపర్ సినిమా తర్వాత గణేష్ మరో సినిమాను నిర్మించలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత నిర్మించే చిత్రమిదే అవుతుంది.
Also Read : సావిత్రి, సౌందర్య, శ్రీదేవి మరణంలోని కీలకపాయింట్ ఇదే..