Balakrishna Son Mokshagna: ‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ అక్కినేని కుటుంబం పై చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం ని రేపాయో మన అందరికీ తెలిసిందే..ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది..బాలయ్య ఈ వివాదం పై స్పందించి అక్కినేని ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్తాడు అనుకుంటే పుండు మీద కారం చల్లినట్టు నిన్న మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు వివాదం ని మరింత పెంచేలా చేసింది.

అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు బాబాయ్ అంటూనే నాగార్జున కి తన తండ్రి మీద ప్రేమ లేదు అన్నట్టు బాలయ్య చేసిన కామెంట్స్ పై అక్కినేని ఫ్యాన్స్ తీవ్రమైన ఆందోళనని వ్యక్తపరుస్తున్నారు..అక్కినేని ఫ్యాన్స్ కి సపోర్టుగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నిలిచారు..సోషల్ మీడియా లో దీనిపై రగడ జరుగుతూనే ఉంది..జరుగుతున్న ఈ వివాదం పై నాగార్జున కుమారులిద్దరూ స్పందించారు కానీ నాగార్జున మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు.
అయితే ఈ వివాదం పై ట్విట్టర్ లో బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ పేరిట ఉన్న ఒక అధికారిక అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ ఇప్పుడు సంచలనం గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘బాలయ్య బాబు మీద కామెంట్స్ చేస్తున్న నాగ చైతన్య ఫ్యాన్స్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి..మీ హీరో ని ఇండస్ట్రీ కి పరిచయం చేయించిందే బాలయ్య బాబు..మీకు ఆయనని కామెంట్ చేసేంత రేంజ్ ఉందా.

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి’ అంటూ ఆ అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది..ఇన్ని రోజులు ఈ అకౌంట్ మోక్షజ్ఞ నే మైంటైన్ చేస్తున్నాడు అనుకోని అతనిని ఫాలో అయ్యారు నందమూరి అభిమానులు..ఇప్పుడు ఆ అకౌంట్ నుండి ఇలాంటి ట్వీట్స్ వచ్చేలోపు అది ఫేక్ అకౌంట్ అని తెలుస్తుంది..దీనిపై బాలయ్య అధికారిక టీం నుండి వివరణ రావాల్సిన అవసరం ఉంది.
నిన్ను వెండితెర కి పరిచయం చేసిందే ఆయన రా @chay_akkineni ఆయనను కామెంట్ చేసే రేంజ్ వుందా రా మీకు వొళ్ళు దగ్గర పెట్టుకొని వుండండి.. జాగ్రత్త…
ఆ ట్వీట్ ని లేపే పావలా గాల్లు మీ వాడిని వార్డు మెంబర్ గా అయిన గెలిపించండిరా
NBK 💥💥🔥
2 Times MLA
TFI Top Hero
Bsvtrkm chairman 😎👍— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) January 25, 2023