https://oktelugu.com/

Daku Maharaj : విడుదలకు ముందే టాలీవుడ్ హిస్టరీ లో అతి చెత్త రికార్డుని నమోదు చేసుకున్న బాలయ్య ‘డాకు మహారాజ్’..పెద్ద అవమానమే ఇది!

సంక్రాంతి సీజన్ నందమూరి బాలకృష్ణ కి ఎంతలా కలిసొచ్చిందో చాలా సంవత్సరాల నుండి మనమంతా గమనిస్తూనే ఉన్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 07:57 AM IST

    Daku Maharaj

    Follow us on

    Daku Maharaj : సంక్రాంతి సీజన్ నందమూరి బాలకృష్ణ కి ఎంతలా కలిసొచ్చిందో చాలా సంవత్సరాల నుండి మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ఆయన కెరీర్ లో సంచలనాత్మకంగా నిల్చిన చిత్రాలన్నీ ఎక్కువ శాతం సంక్రాంతికి విడుదలైనవే ఉన్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి కానీ, ఎక్కువ శాతం హిట్స్ ఉన్నాయి. గత ఏడాది ఆయన సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ చిత్రంతో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు గ్లిమ్స్, టైటిల్ సాంగ్ విడుదలయ్యాయి. ఈ రెండిటికి ఫ్యాన్స్ నుండి సోషల్ మీడియా లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

    అయితే ఈ సినిమా ఖాతాలో ఇప్పుడు ఒక చెత్త రికార్డు చేరింది. అదేమిటంటే వారం రోజుల క్రితం ‘ది రేజ్ ఆఫ్ డాకు’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో సాంగ్ కి ఇప్పటి వరకు కేవలం 2.6 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయట. ఒక టాప్ హీరో కి ఇంత తక్కువ వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని, బాలయ్య ఖాతాలో అలాంటి చెత్త రికార్డు చేరిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న ప్రతీ పాటకు, ట్రైలర్ కి యూట్యూబ్ లో యాడ్స్ వేస్తున్నారు. కానీ డాకు మహారాజ్ కి అలాంటివి చేయలేదు. అందుకే ఇంత తక్కువ వ్యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. నెల రోజుల క్రితం విడుదలైన గ్లిమ్స్ వీడియో కి ఏకంగా 13 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం బాలయ్య అభిమానుల నుండి మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ గ్లిమ్స్ వీడియో ని పొగడ్తలతో ముంచెత్తారు.

    అలాంటి బ్లాక్ బస్టర్ కంటెంట్ వచ్చిన తర్వాత, ఇలాంటి పూర్ రెస్పాన్స్ వచ్చిన సాంగ్ రావడం అభిమానులను నిరాశకి గురి చేసింది. కొంతమంది చెప్పేది ఏమిటంటే ‘డాకు మహారాజ్’ కి అసలు ఆడియన్స్ లో క్రేజ్ లేదని, అందుకే ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్స్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి ఈవెంట్ ని ఈ నెల 27 వ తారీఖున నార్త్ అమెరికా లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. నిన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నార్త్ అమెరికా లోని డల్లాస్ ప్రాంతం లో ఎంత అట్టహాసం గా జరిగిందో మనమంతా చూసాము. ఈ ఈవెంట్ కి అభిమానులు వేలాదిగా హాజరై గ్రాండ్ సక్సెస్ చేసారు, ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా నార్త్ అమెరికా లో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైప్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.