Homeఎంటర్టైన్మెంట్Balayya: సింహాద్రి అప్పన్న సేపలో బాలయ్య

Balayya: సింహాద్రి అప్పన్న సేపలో బాలయ్య

Balayya: నటసింహం నందమూరి బలకృష్ణ హీరోగా వచ్చిన తాజా సినిమా అఖండ. ఇటీవలే విడుదలైన ఈ సినిమా థియేటర్లలో విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. రిలీజ్​ అయిన రెండ్రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టి.. సునామీ సృష్టించింది అఖండ. ముఖ్యంగా ఇందులో బాలయ్య అఘోరా పాత్ర అందరి మనసుల్నీ దోచుకుంది. ఇక బోయపాటి డైరక్షన్​తో పాటు థమన్​ సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శంచుకున్నారు చిత్రబృందం. బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను సహా అఖండ టీమ్​ అప్పన్న దర్శనానికి వెళ్లారు.

Balayya
Balayya

Also Read: బాలయ్య.. ఆ మార్పు త్వరగా లేకుండా చూసుకో !

ఇక్కడ పూజా కార్యక్రమం అనంతరం బాలయ్య అండ్​ టీమ్​ మీడియాతో మాట్లాడుతూ.. అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా సక్కెస్​ మీట్​ను ఏర్పాటు చేశామని తెలిపారు. దానికి ముందుగా స్వామివారిని దర్శించుకుని.. కృతజ్ఞతలు తెలయజేయడానికి సింహాద్రి వచ్చనట్లు పేర్కొన్నారు బాలయ్య. ఈ ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ వచ్చిందిన.

అందుకు ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది మా విజయం మాత్రమే కాదని.. సినీ పరిశ్రమ విజయమని అన్నారు. ఈ సినిమాతో సినీ పరిశ్రమకు మళ్లీ ధైర్యం వచ్చిందని అన్నారు. మంచి సినిమాకు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. కాగా, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వైజాగ్​లోని ఎంజీఎమ్​ గ్రౌండ్​, ఉడా పార్క్​లో అఖండ విజయోత్సవానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు చిత్రబృందం ఆ ప్రదేశానికి చేరుకుంది.

Also Read: బాలయ్య “అఖండ” సినిమా ఒటీటీ రిలీజ్ ఎప్పుడంటే…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular