Balayya Vs NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన వాళ్లలో ‘ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ గారు మొదటి స్థానంలో ఉంటారు. ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన ఘనత కి ఆయనకే దక్కుతోంది. అందుకే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండి పోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయన తర్వాత బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులైతే వచ్చారు. వీళ్లిద్దరు ప్రస్తుతం మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేశారు…ఇక బాలయ్య బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైతే ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకమీదట నుంచి ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి బాలకృష్ణకి ఎన్టీఆర్ కి మధ్య కొన్ని తగాదాలైతే ఏర్పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్ళ మధ్య సన్నిహిత సంబంధలైతే లేవు అనే విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకరి సినిమా ఈవెంట్స్ కి మరొకరు రాకపోవడం, ఒకరి గురించి మరొకరు మాట్లాడకపోవడం…
Also Read: బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
ఎవరికి వారు సెపరేట్ గా ఉండడం చూస్తుంటే వీళ్ళ మధ్య ఏదో పెద్ద గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది… ఇక రీసెంట్ గా బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ బాలయ్య బాబుకు విషెస్ తెలియజేసినప్పటికి ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి విషెస్ ను తెలియజేయలేదు.
ఇక దాంతోపాటుగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరిగిన ప్రతిసారి బాలయ్య బాబు గురించి మాట్లాడిన ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం అతని గురించి అసలు మాట్లాడటం లేదు. ఇక ఇదంతా చూస్తున్న నందమూరి అభిమానులు కొంతవరకు అసంతృప్తి గురవుతున్నారు. ఇక ఎప్పటికైనా వీళ్ళు కలిసి సినిమాలు చేస్తే చూడాలని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒకవేళ కలిసి సినిమాలు చేయకపోయినా పర్లేదు కానీ కలిసి స్టేజ్ మీద కనిపిస్తే అదైనా సంతోషమే అని కోరుకునే అభిమానులు కూడా ఉన్నారు…వీళ్ళ గొడవకి పులిస్టాప్ పడేది ఎప్పుడు, వీళ్ళు ఇంకా ఎన్ని రోజులైనా ఇలాగే గొడవలు పెట్టుకుంటూ ఉంటారా? అంటూ నందమూరి అభిమానులు సైతం వాళ్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…