spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna next movie update: వారంలో 6 కథలను విన్న బాలయ్య...స్టార్ డైరెక్టర్లందరు అతని వైపే...

Balakrishna next movie update: వారంలో 6 కథలను విన్న బాలయ్య…స్టార్ డైరెక్టర్లందరు అతని వైపే చూస్తున్నారా..? కారణం ఏంటంటే..?

Balakrishna next movie update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘అఖండ 2’ నిరాశపరిచినప్పటికి అంతకుముందు చేసిన అఖండ, భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, డాకు మహారాజ్ లాంటి వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ లను సాధించాడు… ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లందరు బాలయ్య బాబు వైపే ముగ్గు చూపిస్తున్నారు. ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసి సక్సెస్ ని అందుకున్న కొరటాల శివ అప్పటినుంచి ఇప్పటివరకు కాళీ గానే ఉన్నాడు. దాదాపు సినిమా రిలీజై సంవత్సరంన్నర అవుతున్నప్పటికి తను నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయలేకపోతున్నాడు. దేవర 2 సినిమా ఉంటుందని అనుకున్నప్పటికి అది ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశాలు లేనట్టుగా తెలుస్తున్నాయి.

దాంతో కొరటాల శివ సైతం బాలయ్య బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే బాలయ్య బాబుని కలిసి ఒక కథను కూడా వినిపించారట. బాలయ్య బాబు ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశమైతే ఉంది.

ఇక కొరటాల శివ తో పాటు హరీష్ శంకర్ సైతం బాలయ్యకు ఒక కథనైతే వినిపించాడు. ఇక అనిల్ రావిపూడి సైతం ఒక డిఫరెంట్ కథను బాలయ్య బాబుకి చెప్పారట… వివేక్ ఆత్రేయ సైతం బాలయ్యకి ఒక కథనైతే చెప్పాడు. అది ఫుల్ మాస్ కథగా తెలుస్తోంది…కన్నడ సినిమా ఇండస్ట్రీలో మార్కో సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘అనీఫ్ ఆదోని’ సైతం బాలయ్య బాబుకి ఒక కథనైతే చెప్పాడు…

ఇక రజనీకాంత్ తో ‘జైలర్’ సినిమా తీసి సూపర్ సక్సెస్ ని సాధించిన నెల్సన్ సైతం బాలయ్య కి ఒక లైన్ అయితే చెప్పారట. మొత్తానికైతే ఈ వారం రోజుల్లో బాలయ్య ఒక ఆరు కథలను విన్నాడు. తనకు జతలు చెప్పిన దర్శకులందరు కూడా స్టార్ డైరెక్టర్లే కావడం విశేషం… ఇక ఇప్పుడు బాలయ్య ముందు కొరటాలతో చేస్తాడా ఇంకా వేరే డైరెక్టర్ తో తను సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version