Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా కమర్షియల్ జానర్ లో సక్సెస్ లను సాధించడంలో బాలయ్యను మించిన వారెవరు లేరనే చెప్పాలి. మాస్ ఎలివేషన్స్ సన్నివేశాలలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపిస్తుంటాడు. అందువల్లే ప్రతి ఒక్క దర్శకుడు కూడా బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథలను రాసుకుంటున్నారు. వాటికి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో వరుసగా నాలుగు విజయాలను సాధించాడు. మధ్యలో ‘అఖండ 2’ కొంతవరకు డీలా పడినప్పటికి ఇప్పుడు మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ వివేక్ ఆత్రేయ లాంటి దర్శకుడు సైతం బాలయ్య బాబుతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పటికి అది వర్కౌట్ అయ్యే విధంగా కనిపించలేదు. కారణం ఏంటంటే వివేక్ ఆత్రేయ మాస్ సినిమాలను అంత బాగా హ్యాండిల్ చేయలేడనే వార్తలు కూడా వస్తున్నాయి. నానితో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేశాడు. కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ కంటే కూడా యాక్షన్ ఎలివేషన్ సీన్స్ కి మాత్రమే ఆయన పెద్ద పీట వేశాడు. మాస్ అంటే అది బాడీ లాంగ్వేజ్ లో నుంచి రావాలి.
రూట్ లెవెల్ నుంచే ఆ రైటింగ్ అనేది డెవలప్ చేసుకుంటూ రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే స్క్రీన్ మీద మాస్ ఎలిమెంట్స్ ఎలివేట్ అవుతుంటాయి. అందుకే బాలయ్య తన నెక్స్ట్ సినిమా కోసం వివేక్ ఆత్రేయ ను పక్కనపెట్టి కొరటాల శివను ఆ ప్లేస్ లో భర్తీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇతనితో పాటుగా మరికొంత మంది కుర్ర దర్శకులను సైతం బాలయ్య పక్కన పెట్టేసాడు…
మొత్తానికైతే బాలయ్య విషయంలో ఈ కుర్ర దర్శకులందరు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాతో కూడా సినిమాలు చేస్తే మేము సక్సెస్ లను కట్టబెడతాం కదా ఆయన యాక్టింగ్ లో వేరియేషన్స్ ను చూపిస్తాం కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యూచర్లో బాలయ్య వీళ్ళతో సినిమాలు చేసే అవకాశం ఉందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
