Balakrishna -HIT 2 Movie: అడివి శేష్-నాని సంతోషానికి అవధుల్లేవు. హీరోగా అడివి శేష్, నిర్మాతగా నాని హిట్ 2 విజయాన్ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే హిట్ 2 రూ. 11 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి క్రిటిక్స్ ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కుతుంది. దర్శకుడు శైలేష్ కొలను టైట్ స్క్రీన్ ప్లే, ఉత్కంఠ రేపే మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా నడిపారన్న మాట వినిపిస్తోంది.

కాగా హిట్ 2 చిత్రాన్ని నటసింహం బాలయ్యకు స్పెషల్ షో వేసి చూపించారు. హిట్ 2 టీం అడివి శేష్, నాని, శైలేష్ కొలనుతో పాటు బాలకృష్ణ మూవీ చూశారు. ఆయనకు ఎంతగానో నచ్చేసిందట. ఈ విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. బాలకృష్ణ సర్ కి హిట్ 2 ఎంతగానో నచ్చింది. నా పెర్ఫార్మన్స్, డైరెక్టర్ ప్రతిభను ఆయన మెచ్చుకున్నారని, అడివి శేష్ పొంగిపోయారు.
అయితే హిట్ 2 స్పెషల్ షోకి బాలయ్యతో పాటు కొడుకు మోక్షజ్ఞ కూడా హాజరయ్యాడు. ఒక సినిమా ఈవెంట్ లో మోక్షజ్ఞ కనిపించడం ఇదే మొదటిసారి. ఇది జస్ట్ స్పెషల్ స్క్రీనింగ్ అయినప్పటికీ మోక్షజ్ఞ అటెండ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడనే నమ్మకాన్ని తాజా పరిణామం కలిగిస్తుంది. హిట్ 2 టీమ్ తో పాటు మోక్షజ్ఞ విక్టరీ సింబల్ చూపిస్తూ స్మైల్ ఇచ్చాడు. ఈ పరిణామం బాలయ్య ఫ్యాన్స్ లో ఆనందం నింపుతుంది.

కాగా ఈ మధ్య కాలంలో బాలకృష్ణ రెండు కీలక ప్రకటనలు చేశారు. ఆయన దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ఉంటుందని వెల్లడించారు. వచ్చే ఏడాది తన డైరెక్టర్ లో ఆ మూవీ ఉంటుంది అన్నారు. అలాగే గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు హాజరైన ఆయన మోక్షజ్ఞ 2023లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారన్నారు. ఈ రెండు సంఘటనలకు లింక్ పెడుతూ.. ఆదిత్య 999 మూవీ మోక్షజ్ఞ హీరోగా బాలయ్య దర్శకత్వంలో తెరకెక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రతి ఏడాది మోక్షజ్ఞ హీరో అవుతాడంటూ వార్తలు రావడమే కానీ కార్యరూపం దాల్చడం లేదు. మరి వచ్చే ఏడాది ఏమవుతుందో చూడాలి.