https://oktelugu.com/

Balakrishna Wife Vasundhara: బాలయ్య భార్య వసుంధర ఎవరి కూతురు.. ఆమె ఆస్తి విలువ ఎంతంటే?

Balakrishna Wife Vasundhara: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం..బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలతో పాటు ఓటీటీ వేదికగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షోతో ఇరగదీస్తున్నారు. ఇకపోతే ఆయన నటించిన ‘అఖండ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అఖండమైన ఆదరణ లభిస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. బాలయ్య భార్య వసుంధర గురించి ఇటీవల […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 5, 2022 / 10:00 AM IST

    Balakrishna Wife Vasundhara

    Follow us on

    Balakrishna Wife Vasundhara: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం..బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలతో పాటు ఓటీటీ వేదికగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షోతో ఇరగదీస్తున్నారు. ఇకపోతే ఆయన నటించిన ‘అఖండ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అఖండమైన ఆదరణ లభిస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. బాలయ్య భార్య వసుంధర గురించి ఇటీవల ‘అన్ స్టాపెబుల్’షోలో బాలయ్య ప్రస్తావించారు. తన భార్యకు బాలయ్య.. ఐ లవ్ యూ కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఇంతకీ బాలయ్య భార్య ఎవరు? ఆమెకు ఉన్న ఆస్తి విలువ ఎంతనో తెలుసుకుందాం.

    Balakrishna Wife Vasundhara

    సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నాడు. బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలయ్య 1982లో వసుంధర దేవిని మ్యారేజ్ చేసుకున్నాడు. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యారావు కూతురు వసుంధర దేవి. వందల కోట్ల ఆస్తికి వారసురాలు అయిన వసుంధర గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాతనే బాలయ్యను మ్యారేజ్ చేసుకుంది.ఇకపోతే బాలయ్య సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండగా, కుటుంబ వ్యవహారాలన్నిటినీ వసుంధరనే చక్కబెట్టుకుంటు వస్తుంది.

    Also Read: అఖండ క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య !

    బాలకృష్ణ-వసుంధరలకు ముగ్గురు సంతాన. బ్రాహ్మణి, తేజస్వి, మోక్షజ్ఞలు కాగా, బ్రాహ్మణిని ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ కు ఇచ్చి మ్యారేజ్ చేశారు బాలయ్య. ఇక తేజస్విని వైజాగ్ గీతం సంస్థలకు చెందిన శ్రీ భరత్ కు ఇచ్చి మ్యారేజ్ చేశాడు. ఇక తనయుడు మోక్షజ్ఞ త్వరలో వెండితెరపైన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు.

    బాలయ్య ప్రస్తుతం వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నారు. ప్రజెంట్ ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బాలయ్య త్వరలోనే.. అనిల్ రావిపూడి, మలినేని గోపీచంద్ లతో మూవీస్ చేయబోతున్నాడు. గోపీచంద్ మలినేని ‘క్రాక్’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో బాలయ్య సరసన బ్యూటిఫుల్ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించబోతున్నది.

    Also Read: బాలయ్య తమాషా ప్రశ్నలు.. మహేష్ చమత్కార సమాధానాలు !

     

    Tags