Unstoppable With NBK: వరుస సినిమాలతో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య.. ఇప్పుడు గోపిచంద్ మలినేనితో కలిసి మరో ప్రాజెక్టును పట్టాలెక్కిచేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఇప్పటికే విడుదలైన అఖండ ట్రైలర్ నెట్టింట్లో ఓ ఊపు ఊపేస్తోంది. బోయపాటి దర్శకత్వంలో తెరక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు.

కాగా, ఇటీవలే గోపిచంద్ సినిమా షూటింగ్ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది. దీంతో పాటు, ప్రస్తుతం ఓటీటీలో కూడా సందడి చేస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ తెలుగు సంస్థ ఆహాతో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తున్నారు. తన కెరీర్లో హోస్ట్‌గా ఓ కార్యక్రమం చేయడం బాలయ్యకు తొలిసారి. కాగా, ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని ట్రెండింగ్‌లో దూసుకెళ్లిపోతున్నారు. తొలి ఎపిసోడ్‌ను మంచు మోహన్‌బాబుతో స్టార్ట్ చేశారు బాలయ్య. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో అలరించారు. ఇక తర్వాత ఎపిసోడ్లో ఎవరు గెస్ట్‌గా వస్తారని అనుకుంటుండగా.. ఇటీవల బాలయ్య బుజానికి సర్జరీ కావడంతో కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
అయితే, త్వరలోనే కోలుకుని షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ షోకు తర్వాత గెస్ట్‌గా రోజా పేరు వినిపించడం గమనార్హం. ఇటీవల రోజా పుట్టినరోజు సందర్భంగా విషెష్ చెప్పిన బాలయ్య.. ఈ షో గురించి ప్రస్తావించగా తాను గెస్ట్‌గా వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెతో ఓ ఎపిసోడ్ నిర్వహంచే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్. అయితే, ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.