Balakrishna: నటసింహం బాలయ్య బాబు ఈ మధ్య వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నారు. ఏ దర్శకుడు అయినా కథ చెబుతాను అని ఫోన్ చేస్తే.. ముందుగా అడుగుతున్న ప్రశ్న.. కథలో కొత్త ఎలిమెంట్స్ ఏమున్నాయో మెసేజ్ పెట్టమని.. అవి నచ్చితే అప్పుడు కథ వింటాను అంటూ బాలయ్య చెబుతున్నాడట. నిజంగా ఇది షాకింగ్ విషయమే. ఎందుకంటే.. బాలయ్య అంటేనే ఎమోషనల్ పర్సన్. ఒకసారి ఒక డైరెక్టర్ ను నమ్మితే.. ఇక కథలు గాధలు పట్టించుకోడు.

అందుకే, బాలయ్య గత కొన్నేళ్లుగా రొటీన్ కొట్టుడు సినిమాలతో వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. ఓ దశలో బాలయ్య సినిమా అంటే.. ఇక రోటీన్ యాక్షన్ తో పాటు అవే బిల్డప్ షాట్స్, అవే మాస్ డైలాగ్స్ ఉంటాయని.. థియేటర్ కి వెళ్లి ఇక సినిమా చూడక్కర్లేదు అని అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. ఒకపక్క స్టార్ హీరోల సినిమాలు వందల కోట్ల మార్క్ ను దాటుతుంటే.. బాలయ్య సినిమాలు మాత్రం ఏభై కోట్లు దగ్గరే ఆగిపోయాయి.
అదే ఒకప్పుడు బాక్సాఫీస్ కింగ్ అని బాలయ్యను ముద్దుగా పిలుచుకునే వాళ్ళు. ఆ రేంజ్ లో బాలయ్య సినిమాలకు కలెక్షన్స్ వచ్చేవి. కానీ పాపం బాలయ్య సినిమాలు చివరకు గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. కారణం బాలయ్యకు రొటీన్ సినిమాల వలయంలో పడిపోయాడు అనే పేరు రావడమే. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య అఖండ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమాలో మొదటిసారి అఘోర పాత్రలో కనిపిస్తున్నాడు. అఘోరా పాత్రలో బాలయ్య పూర్తిగా కొత్తగా కనిపించాడు. దాంతో బాలయ్య నుంచి కొత్తదనం రావడంతో ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. దెబ్బకు అఖండ టీజర్ రికార్డుల మోత మోగించింది. దాంతో బాలయ్యకు అర్ధం అయిపోయింది. తన నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటారో అని. అందుకే కొత్తదనం కోసం బాలయ్య తాపత్రయ పడుతున్నాడు.
ఏది ఏమైనా బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న అఖండ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు.