Balakrishna Son Mokshagna: తెలుగు చలన చిత్ర రంగం లో నందమూరి కుటుంబానికి ఉన్న చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..బహుశా మాస్ అనే పదం నందమూరి కుటుంబం నుండే పుట్టిందా అనేంతలా మాస్ ఆడియన్స్ లో ఆ కుటుంబానికి చెందిన హీరో లు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు..స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి తర్వాత ఆయన కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు..ఎన్నో హిట్స్ , బ్లాక్ బస్టర్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ తో బాలయ్య బాబు టాప్ 4 హీరోస్ లో ఒకరిగా దశాబ్దాలు కొనసాగాడు..ఇక ఆయన తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా పెద్ద స్టార్ హీరో అయ్యి నేడు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపు తెచుకున్నాడో మన అందరికి తెలిసిందే..ఇక కళ్యాణ్ రామ్ కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు..ఇక ఇప్పుడు అందరి చూపు నందమూరి మోక్షజ్ఞ వైపే ఉంది.

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు..కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ప్రతి ఏడాది పలానా డైరెక్టర్ తో ఉంటుంది అని వార్తలు అయితే వస్తున్నాయి కానీ..ఏది కార్యరూపం దాల్చలేదు..అంతే కాకుండా మోక్షజ్ఞ శరీరాకృతి ని చూసి అభిమానులకు అసలు ఇతనికి సినిమాల్లో నటించే ఆసక్తి ఉందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.
అయితే బాలయ్య బాబు మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉంటుంది అని..ప్రస్తుతం నటన, డాన్స్ మరియు ఫైట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడని..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెడుతామని చెప్పుకొచ్చారు బాలయ్య బాబు..అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే మోక్షజ్ఞ ఎంట్రీ కి సర్వం సిద్ధం అయ్యిందని..ఆయన మొదటి సినిమాకి ‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..రాహుల్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయనకీ మంచి క్రేజ్ వచ్చింది.

ఇతని సినిమాల కోసం ఎదురు చూసే ఆడియన్స్ కూడా బాగానే ఉన్నారు..పైగా రాహుల్ చెప్పిన స్టోరీ బాలయ్య బాబు కి బాగా నచ్చడం తో వెంటనే ఆలోచించకుండా బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..అయితే నందమూరి హీరో కదా మొదటి సినిమా మాస్ స్టోరీ అని అనుకుంటే పొరపాటు పడినట్టే..ఇది పూర్తిగా లవ్ స్టోరీ అట..ఈ సినిమాకి ‘ప్రేమించి చూడు’ అనే టైటిల్ కూడా పెట్టినట్టు సమాచారం..మరి నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ని లవర్ బాయ్ గా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి.
[…] Also Read: Balakrishna Son Mokshagna: లవ్ స్టోరీ తో టాలీవుడ్ లోకి… […]