Homeఎంటర్టైన్మెంట్NBK 109: దర్శకుడు బాబీకి బాలయ్య షాక్... ఆ ఆలోచనలో నందమూరి హీరో!

NBK 109: దర్శకుడు బాబీకి బాలయ్య షాక్… ఆ ఆలోచనలో నందమూరి హీరో!

NBK 109: బాలకృష్ణ(Balakrishna) వరుస విజయాలతో జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీతో 109వ చిత్రం చేస్తున్నారు. అయితే బాలకృష్ణ నిర్ణయంతో బాబీకి షాక్ తప్పదంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బాలయ్య చిత్రాలను వేగంగా పూర్తి చేస్తాడు. దర్శక నిర్మాతలను పరుగులు పెట్టిస్తారు. ఒక్కో సినిమాకు ఏళ్ల సమయం తీసుకోవడం ఆయనకు నచ్చదు. 2023 జనవరిలో వీరసింహారెడ్డి విడుదల చేసిన బాలయ్య, భగవంత్ కేసరి చిత్రాన్ని 9 నెలల్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. భగవంత్ కేసరి విడుదల కాకుండానే 109 చిత్ర షూటింగ్ కి పచ్చ జెండా ఊపాడు.

బాబీ-బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి NBK 109 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శివరాత్రి కానుకగా టీజర్ విడుదల చేశారు. బాలయ్య లుక్, డైలాగ్స్, మేనరిజం మెస్మరైజ్ చేశాయి. టీజర్ కి థమన్ బీజీఎమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన NBK 109 టీజర్ అంచనాలు పెంచేసింది.

బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆశలపై బాలయ్య నీళ్లు చల్లినట్లు సమాచారం. బాలకృష్ణ NBK 109 షూట్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వనున్నాడట. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ తరఫున హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన బాలయ్య హ్యాట్రిక్ పై కన్నేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాలయ్యకు టికెట్ కూడా కన్ఫర్మ్ చేశాడు.

ఈ క్రమంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. వైసీపీ పార్టీ నుండి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఆషామాషీగా తీసుకోకూడదని బాలయ్య భావిస్తున్నారట. బావ చంద్రబాబు సూచనల మేరకు త్వరలోనే హిందూపురంలో బాలయ్య ఎన్నికల ప్రచారానికి సిద్ధం కానున్నాడట. దీంతో NBK 109 షూటింగ్ ఎన్నికల తర్వాతే అంటున్నారు. ఇది ఒకింత దర్శకుడు బాబీని నిరాశపరిచే అంశమే అని చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular