Homeఎంటర్టైన్మెంట్Balakrishna New Look: వైరల్ : ఓల్డ్‌ గెటప్‌ లో హీరో.. పవర్‌ ఫుల్‌...

Balakrishna New Look: వైరల్ : ఓల్డ్‌ గెటప్‌ లో హీరో.. పవర్‌ ఫుల్‌ గెటప్‌ లో విలన్

Balakrishna New Look: నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా నుంచి తాజాగా ‘బాలయ్య లుక్’ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ హీరో దునియా విజయ్‌ విలన్‌ గా నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా బాలయ్యకు పూల బుకే ఇస్తూ దిగిన ఫొటోని దునియా విజయ్‌ షేర్‌ చేశాడు. బాలయ్య ఓల్డ్‌ గెటప్‌లో మాస్‌ గా కనిపించగా, దునియా విజయ్‌ అందుకు తగ్గట్టు పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపించాడు.

Balakrishna New Look
Balakrishna New Look

మొత్తానికి దునియా విజయ్‌ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో బాలయ్య లుక్ అదిరిపోయింది. అన్నట్టు బాలయ్య లుక్ కి సంబంధించి ఆ మధ్య ఒక పోస్టర్ ను విడుదల చేసింది టీం. బ్లాక్ షర్ట్ వేసుకున్న బాలయ్య… లుంగీతో దర్శనమిచ్చాడు. పైగా బ్లాక్ కారు పక్క నుంచి బాలయ్య అలా నడుస్తూ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. మొత్తానికి బాలయ్య స్టైలిష్ మాసివ్ అవతార్ లో అదరగొట్టాడు.

Also Read: Sai Pallavi: పొలంలో కూలీ పనులు చేస్తున్న క్రేజీ స్టార్ హీరోయిన్

ఇక ఆ పోస్టర్ ను బట్టి మైనింగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా నడిచేలా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్య లుక్ చూసి నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌ గా సిరిసిల్లలో ప్రారంభమైంది. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ అద్భుతంగా నటిస్తున్నాడట.

ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ‘బాలయ్య బాబు’ అరవై ఏళ్ల వయసులో ‘అన్ స్టాపబుల్’లా దూసుకువెళ్తున్నాడు. ఏది ఏమైనా ‘అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ నేషనల్ రేంజ్ లో పాకింది. బాలయ్యకి అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది. క్రేజ్ డబుల్ అయింది.

Balakrishna New Look
Balakrishna New Look

బాలయ్యతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. పైగా బాలయ్య ముందు ఆలోచించేదే నిర్మాత గురించి. నిర్మాత లాభం కోసం, బాలయ్య అర్ధరాత్రులు కూడా పని చేసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే, బాలయ్య డేట్లు కోసం ఇప్పుడు అందరూ ఎగబడుతున్నారు. ప్రస్తుతం బాలయ్యకి విపరీతంగా డిమాండ్ పెరిగింది.

Also Read:Actor Hema: డ్రగ్స్ కేసులో తన పేరు ఆ మీడియా వెల్లడించడంపై నటి హేమ నిప్పులు

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

  1. […] Karan Johar: మన సౌత్ స్టార్స్ బాలీవుడ్ లో సైతం భారీ కలెక్షన్స్ ను సాధిస్తూ అక్కడ కూడా తమకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరోలు కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. అయితే, మిగిలిన బాలీవుడ్ మేకర్స్ సంగతెలా ఉన్నా.. కరణ్ జోహార్ మాత్రం సౌత్ హీరోలకు నేనున్నా అంటూ ముందుకు వస్తున్నాడు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular