Balayya: ఈ మధ్య కాలంలో థియేటర్స్ లోకి ఓ భారీ మాస్ సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. నిజానికి క్రాక్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి పవర్ ఫుల్ యాక్షన్ సినిమా రాలేదు. అలాంటి మాస్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం దగ్గరలో కనిపిస్తున్న అలాంటి సినిమా ఒక్కటే. నటసింహం బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న యాక్షన్ కొట్టుడు సినిమా ‘అఖండ’.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ లో చూడొచ్చని బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మాస్ లవర్స్ కూడా ఎదురుచూస్తుంటే.. బాలయ్య మాత్రం ఈ సినిమా రిలీజ్ పనులు పక్కన పెట్టి.. ప్రస్తుతం ఆహా ఓటీటీ కోసం చేస్తున్న టాక్ తో ఫుల్ బిజీగా మారాడు. ఈ షోకి ముందు బాలయ్య దృష్టి మొత్తం సినిమా పైనే ఉండేది.
ఎప్పుడు తన సినిమాను రిలీజ్ చేద్దామా అని చూసిన బాలయ్య, తాజాగా తన తీరు మారినట్టు కనిపిస్తుంది. ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా తెగలేదు. అందుకే అప్పటి వరకు తన సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో బాలయ్య లేడు అట. ఇక బాలయ్య టాక్ షోతో హంగామా చేయనున్నాడు. ఈ షో హిట్ అయితే, బాలయ్య ఖాతాలో మరిన్ని షోలు వచ్చే అవకాశం ఉంది.
అన్నట్టు బాలయ్య – బోయపాటి కలయికలో సింహా, లెజెండ్ లాంటి బారీ హిట్స్ రావడం, ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ కలిసి మరో ప్రయత్నం చేస్తుండటంతో…. అఖండ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రైట్స్ కోసం కూడా భారీగా పోటీ ఉంది. ఎంతైనా 70 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అఖండ టీజర్ సృష్టిస్తోన్న సంచలనాల గురించి తెలిసిందే.
ఒక విధంగా వ్యూస్ పరంగా యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ ను సృష్టిచింది ఈ సినిమా టీజర్. అందుకే, శాటిలైట్ డీల్ కూడా ఎప్పుడో కుదిరింది ఈ సినిమాకు. థియేటర్స్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది.