Homeఎంటర్టైన్మెంట్Balakrishna: 'అఖండ' తర్వాత సినిమా కోసం అమెరికాకు బాలయ్య.. షూటింగ్​ అంతా అక్కడేనట!

Balakrishna: ‘అఖండ’ తర్వాత సినిమా కోసం అమెరికాకు బాలయ్య.. షూటింగ్​ అంతా అక్కడేనట!

Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ఇటీవల విడుదలైన ట్రైలర్​ని బట్టి.. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంతో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, వీడియోలు నెట్టింట వైరల్​గా మారాయి. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు వేరే లెవల్​కు చేరుకున్నాయి. కాగా, బాలయ్య- బోయపాటి కాంబోలో ఇది మూడో సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన సింహా, లెజెండ్​ చిత్రాలు బాక్సాఫీసును ఓ ఊపు ఊపేశాయి. ఇది కనుక హిట్ అయితే, ఇద్దరు కలిసి హ్యాట్రిక్​ కొట్టినట్లే.

కాగా, ఈ సినిమా తర్వాత క్రాక్​ దర్శకుడు గోపిచంద్ మలినేనితో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకుని.. లాంచనంగా షూటింగ్​ ప్రారంభించింది. త్వరలోనే పూర్తిస్థాయి షూటింగ్​ ప్రారంభించనున్నారు. కాగా, ఇందులో శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటించనుంది. ఈ క్రమంలోనే బాలయ్య కోసం గోపిచంద్​ అదిరిపోయే కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కథ పరంగా ఎక్కవ భాగం అమెరికాలోనే షూట్​ చేయనున్నట్లు సమాచారం. ఇందులో కూడా బాలయ్య డ్యుయల్ రోల్​లో కనిపించనున్నారట.

దీంతో పాటు, ఎన్​ఆర్​ఐ అవతారం కూడా ఎత్తనున్నట్లు తెలుస్తోంది.  గతంలో బాలయ్య ఈ సినమాలో పోలీస్​గా కనిపించనున్నట్లు వార్తలు నిపించాయి. కాదు, ఫ్యాక్షనిస్ట్​గా కనిపిస్తాడంటూ మరికొందరు చెవులు కొరికారు. అయితే, అసలు నిజం ఏంటని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా కోసం శ్రుతి హాసన్​ భారీగా పారితోషకం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తమన్​ సంగీతం అందిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular