Balakrishna: నందమూరి నటసింహంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు ఏది చేసిన అది ఒక సంచలనంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవ్వరు టచ్ చేయని జనర్లలో సినిమాలు చేసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక అలాంటి బాలయ్య ప్రస్తుతం వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నాడు. ఇక ఇంతకుముందు ఈయన ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి జానర్లలో కథలను ఎంచుకొని మంచి సినిమాలను చేస్తూ వచ్చాడు.
ఇప్పుడు కమర్షియల్ సినిమాలను చేస్తేనే జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు అని తెలుసుకున్న బాలయ్య బాబు కమర్షియల్ సినిమాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు. ఇక ఇప్పుడు రీసెంట్ గా తెలుస్తున్న విషయం ఏంటి అంటే బాలయ్య బాబు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికి ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తనదైన రీతిలో తెరకెక్కించినట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఎప్పటినుంచో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు కానీ అది అనుకోని కారణాల వల్లన పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.
ఇక మొత్తానికి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జనర్ లో సినిమా చేయబోతున్నట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇంకా దీనిపైన అఫీషియల్ గా బాలయ్య బాబు గాని, ప్రశాంత్ వర్మ గాని ఎవరూ కూడా స్పందించలేదు అయినప్పటికీ ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక బాలయ్య బాబు అన్ స్టాపబుల్ సీజన్ 1 కి ప్రశాంత్ వర్మ నే దర్శకుడుగా వ్యవహరించాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. అప్పటినుంచి కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. కానీ అది ఎక్కడ కూడా వర్కౌట్ కావడం లేదు.
ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సినిమా అనేది పట్టాలెక్కలేదు. ఇక ఎప్పుడు మాత్రం బాలయ్య బాబు ఫ్రీ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య బాబు, బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇక సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటి డైరెక్షన్ లో ఒక సినిమా చేసి అప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా చేయాలను కుంటున్నట్టు గా తెలుస్తుంది…