Site icon OkTelugu

Balakrishna Pan India Movie: బాలయ్య మొదటి పాన్ ఇండియా సినిమాకి ఒకే చెప్పాడా…డైరెక్టర్ ఎవరంటే…

Balakrishna Pan India Movie

Balakrishna Pan India Movie

Balakrishna Pan India Movie: ప్రస్తుతం బాలయ్య బాబు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయనకి బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ 2’ మూవీ భారీ దెబ్బ కొట్టింది. ఆ సినిమాతో ఆయన సక్సెస్ ల పరంపరకు బ్రేక్ పడిందనే చెప్పాలి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు… ఇక మొత్తానికైతే బాలయ్య బాబు పాన్ ఇండియాలో కూడా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇక పాన్ ఇండియా సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. బాలయ్య బాబుతో పాన్ ఇండియా సినిమా చేసే దర్శకుడు ఎవరు అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

కొరటాల శివ ఇంతకుముందు చేసిన దేవర సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ చేసి సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఈ సినిమాని కూడా పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే మంచి విజయం దక్కుతుందని అంచనాలో కొరటాల శివ ఉన్నాడు. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు సైతం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఇక పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి కూడా సినిమాలో అంత మంచి కంటెంట్ అయితే ఉందని దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే పాన్ ఇండియాలో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని బాలయ్య బాబు భావిస్తున్నాడట. అందుకే కొరటాలకు ఫుల్ రైట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాని జూలై నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాని సైతం తను చాలా కేర్ ఫుల్ గా చేస్తూ సినిమాని సక్సెస్ఫుల్ దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

Exit mobile version