https://oktelugu.com/

BalaKrishna : ఐకానిక్ రోల్ లో బాలయ్య ఫెయిల్ అయ్యాడు, ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు! బాబాయ్ ని దెబ్బ తీసిన అబ్బాయ్!

ఓ ఐకానిక్ రోల్ బాలకృష్ణ చేశాడు. అదే పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. బాలయ్య మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేశాడు. ఇంతకీ ఆ స్పెషల్ రోల్ ఏమిటీ? ఆ చిత్రాలు ఏమిటీ? ఇంట్రెస్టింగ్ స్టోరీ

Written By:
  • S Reddy
  • , Updated On : November 22, 2024 / 02:57 PM IST

    BalaKrishna-JR NTR

    Follow us on

    BalaKrishna : ప్రస్తుతం బాలకృష్ణ-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. రాజకీయంగా తలెత్తిన విబేధాలు నందమూరి అభిమానులను రెండు వర్గాలుగా చీల్చాయి. ఎన్టీఆర్ ఇటీవల దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు టీడీపీ కార్యకర్తల్లోని ఓ వర్గం దేవర చిత్రం పై నెగిటివ్ ప్రచారం చేయడం విశేషం. ఇక బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ తన అన్న జానకిరామ్ కొడుకును రంగంలోకి దించుతున్నాడు.

    జానకి రామ్ కొడుకు పేరు కూడా ఎన్టీఆర్ నే. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో జానకి రామ్ కుమారుడు మూవీ చేస్తున్నాడు. ఇటీవల యంగ్ ఎన్టీఆర్ లుక్ రివీల్ చేశారు. మోక్షజ్ఞకు పోటీగా యంగ్ ఎన్టీఆర్ ని తెరపైకి తెచ్చారనే వాదన ఉంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ని దెబ్బ తీయాలని బాలకృష్ణ.. తారక రత్నను గ్రాండ్ గా లాంచ్ చేశాడట. దానికి రివేంజ్ గా మోక్షజ్ఞను దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక బాబాయ్-అబ్బాయ్ ఇప్పట్లో కలిసే సూచనలు లేవు.

    ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ఐకానిక్ పాత్రలో ఎన్టీఆర్ సక్సెస్ అయితే, బాలకృష్ణ ఫెయిల్ అయ్యాడు. విషయం ఏమిటంటే… లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు తన 150వ చిత్రం నందమూరి బాలకృష్ణతో చేశాడు. పరమవీరచక్ర ఆ మూవీ టైటిల్. 2011లో ఈ చిత్రం విడుదలైంది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు. ఈ మూవీలో కొన్ని నిముషాలు బాలకృష్ణ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తాడు.

    పరమవీరచక్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన ఎన్టీఆర్.. బాబాయ్ పూర్తి స్థాయి కొమరం భీమ్ పాత్రలో సినిమా చేస్తే చూడాలని ఉందనే కోరిక బయటపెట్టాడు. అది జరగలేదు. పరమవీరచక్ర ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. కనీస ఆదరణ దక్కలేదు. కట్ చేస్తే ఒక దశాబ్దం అనంతరం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమరం భీమ్ రోల్ చేశాడు. అయితే ఇది కొమరం భీమ్ బయోపిక్ కాదు. ఆ ఉద్యమకారుడి స్పూర్తితో రాజమౌళి తెరకెక్కించిన పాత్రలో ఎన్టీఆర్ నటించాడు.

    భీమ్ గా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. ఇండస్ట్రీ హిట్ నమోదు చేశాడు. బాలయ్యకు కొమరం భీమ్ పాత్రలో ఫెయిల్ అయితే ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. అదన్నమాట మేటర్.