Site icon OkTelugu

Balakrishna Nippuravva Movie: ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాలను బాలయ్య ఎప్పుడో చేసేశాడా..?

Balakrishna Nippuravva Movie

Balakrishna Nippuravva Movie

Balakrishna Nippuravva Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ హీరోలందరు భారీ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదిస్తున్న క్రమంలో కొంతమంది దర్శకులు మాత్రం డిఫరెంట్ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇప్పటివరకు తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులు ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు… ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన ‘సలార్’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ డార్క్ షేడ్ లో కనిపించి కనిపించని విజువల్స్ తో ఉంటాయని నిజానికి ఆయన కోల్ మైన్స్ లో ఎక్కువగా సన్నివేశాలను రాసుకొని అక్కడే సినిమా మొత్తాన్ని చిత్రీకరించే విధంగా స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. అయితే అది చూసిన ప్రేక్షకులు చాలా కొత్త అనుభూతిని పొందుతున్నారు.

నిజానికి 1993 వ సంవత్సరంలో చేసిన ‘నిప్పురవ్వ’ సినిమాలో కోల్ మైన్స్ గురించి అక్కడివాళ్ళు పడే బాధల గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ సినిమా కోసం బాలయ్య విపరీతంగా కష్టపడ్డాడు. ఈ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో బాలయ్య కొంతవరకు డీలా పడ్డాడు. ఇక కోల్ మైన్స్ గురించి ప్రశాంత్ నీల్ కంటే ముందే బాలయ్య బాబు ప్రస్తావించాడు.

నిప్పు రవ్వ పేరుతో సినిమా కూడా చేశాడంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాలయ్య బాబు అభిమానులు కొన్ని వార్తలను వైరల్ చేస్తున్నారు. నిజానికి బాలయ్య అప్పట్లో కొన్ని ఎక్స్పరిమెంటల్ సినిమాలను కూడా చేశాడు. అవి అనుకున్న రేంజ్ లో ఆడకపోవడంతో సక్సెస్ ఫుల్ సినిమాల వైపే అతను పరుగులు తీశాడు…

Exit mobile version