Site icon OkTelugu

Balayya And Prabhas Missed Film: బాలయ్య – ప్రభాస్ కాంబోలో మిస్ అయిన సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

Balayya And Prabhas Missed Film

Balayya And Prabhas Missed Film

Balayya And Prabhas Missed Film: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న మాస్ సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్తున్నాడు. వరుసగా నాలుగు విజయాలతో సక్సెస్ లను సాధించిన ఆయనకి ‘అఖండ 2’ సినిమాతో బ్రేక్ పడింది. అయినప్పటికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలోనే చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా విషయంలో ఆయన తన సజెషన్స్ ని కూడా చెబుతున్నారట. మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఈశ్వర్ సినిమాతో భారీ విజయాన్ని సాధించిన ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మరింత ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం హను హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాలతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు…

ఒకానొక టైమ్ లో బాలయ్య, ప్రభాస్ లను హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి కొంత మంది దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపించారు. దానికి తగ్గట్టుగా ఒక మంచి కథను కూడా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్లిద్దరు కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి అనుకోని కారణాల వల్ల సినిమా అయితే పట్టాలెక్కలేదట. ఇక బాలయ్య, ప్రభాస్ మధ్య చాలా మంచి సన్నిహిత్యం ఉందనే విషయం మనందరికి తెలిసిందే…

ఇక ఏది ఏమైనా కూడా ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అటు ప్రభాస్ అభిమానులు, ఇటు బాలయ్య బాబు ఫ్యాన్స్ సైతం ఆసక్తిని చూపిస్తుండటం విశేషం…వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఒకవేళ ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం సూపర్ హిట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Exit mobile version