Balakrishna: ప్రస్తుతం బాలయ్య బాబు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఆయన ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ వస్తున్నాడో అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా అంటే అందరూ ఏ విధంగా కష్టపడుతారో దానికి పది రెట్లు ఎక్కువ కష్టపడుతూ సినిమాలు చేస్తూ ఉంటాడు ప్రతి సినిమాకి చాలా ఎక్కువగా కష్టపడుతూ మంచి గుర్తింపును పొందుతూ ఉంటాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా చెబుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
నిజానికి బాలయ్య ఈ సినిమా మీద మంచి అంచనాలే పెట్టుకున్నాడు ఎందుకంటే వీళ్ళ కాంబో లో వచ్చిన సినిమాలు మంచి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇక మళ్ళీ వీళ్ళ కాంబో లో చేసే సినిమా మూడు సినిమాలకు మించి ఉండాలనే ఉద్దేశ్యం తోనే బాలయ్య బోయపాటి తో ఈ సినిమా మీద కొంచెం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టమని చెప్పినట్టుగా తెలుస్తుంది.
అందులో భాగంగానే బోయపాటి స్క్రిప్ట్ దశలోనే చాలా కష్టపడుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇంతకు ముందు బోయపాటి రామ్ తో చేసిన స్కంద సినిమా హిట్ కాకపోవడంతో ఇప్పుడు బాలయ్య బాబు సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈయన చేసే ఈ సినిమాలో కూడా ఇద్దరు బాలకృష్ణ లు ఉండబోతున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఒక బాలకృష్ణ ఆర్మీ మేజర్ గా ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇంతకుముందు వీళ్లు చేసిన అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో కనిపించి అందరిని మెప్పించాడు. బార్డర్ లో ఉండే పాత్రను పోషించడమే కాకుండా ఆర్మీ బ్యాక్ డ్రాప్ సినిమాగా ఇది తెరకెక్కబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ సినిమాతో వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు ఉన్న మూడు సినిమాలకు మించి ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తారా లేదా అనే విషయం మీదనే ప్రస్తుతం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా మంచి సక్సెస్ అయితే బాలయ్య బోయపాటి ల పేర్లు మరోసారి ఇండస్ట్రీలో మార్మోమ్రోగిపోతాయి ఈ సినిమాను బాలయ్య, బోయపాటి ఇద్దరు కూడా చాలా సీరియస్ గా తీసుకొని చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తో కనక బోయపాటి బాలయ్య మరో హిట్ ఇస్తే బాలయ్య అభిమానులు బాలయ్యని జన్మలో మర్చిపోరు…