Samarasimha Reddy: బాలకృష్ణ కెరీర్లో మైలురాయిగా నిలిచింది సమరసింహారెడ్డి. ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్. సమరసింహారెడ్డి విజయంతో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. చాలా వరకు విజయం సాధించాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు బీ గోపాల్ తెరకెక్కించాడు. బాలకృష్ణ రెండు భిన్నమైన రోల్స్ చేశారు. పౌరుషానికి మారుపేరైన సమరసింహారెడ్డి ఒక పాత్ర కాగా, హోటల్ లో పనిచేసే అబ్బులు మరొక రోల్. సమరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా 1999 జనవరి 13న విడుదల చేశారు.
బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సమరసింహారెడ్డి రూ. 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఆ మూవీ రూ. 15 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కి కాసులు కురిపించింది. 73 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సమరసింహారెడ్డి 29 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది. బాలయ్య ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం ఇది.
ఇప్పటికీ బాలయ్య ఫ్యాన్స్ సమరసింహారెడ్డి చిత్రం గురించి గొప్పగా చెప్పుకుంటారు. బాలయ్య నట విశ్వరూపం ఆ చిత్రంలో చూడొచ్చు. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ గా జయప్రకాశ్ రెడ్డి నటన ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ అద్భుత చిత్రాన్ని రీరీలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 2న సమరసింహారెడ్డి విడుదల కానుంది. ఫ్యాన్స్ కోసం 4కే వెర్షన్ అందుబాటులోకి తెస్తున్నారు. కాబట్టి మరోసారి బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ తో థియేటర్స్ దద్దరిల్లనున్నాయి.
ఇంకెందుకు ఆలస్యం బాలయ్య ఓల్డ్ బ్లాక్ బస్టర్ ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధం కండి. మరోవైపు బాలయ్య ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఆయన నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుస విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను బాబీ సరికొత్తగా చూపించనున్నాడట.
Web Title: Balakrisha samarasimha reddy movie is ready for re release
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com