Balagam Movie: మాకు భారీ బడ్జెట్ సినిమాలు , భారీ తారాగణం ఉన్న సినిమాలు అక్కర్లేదు రా బాబు,కంటెంట్ అద్భుతంగా ఉండే సినిమాలు ఇవ్వండి అంటూ సినిమా మేకర్స్ ని ప్రేక్షకులు మొత్తుకుంటూ ఉంటారు.కానీ కొంతమంది హంగులు ఆర్భాటాలకు పోయి కోట్ల రూపాయిలను బురదలో పోస్తున్నారు.ఈ వారం విడుదలైన ఒక సినిమా అందుకు ఉదాహరణ.కానీ దర్శకుడి ప్రతిభ కి అడ్డం పట్టేలా రీసెంట్ గా విడుదలైన ‘బలగం’ అనే చిత్రం, ఎచ్చులకు పోయే దర్శక నిర్మాతలకు ఒక గుణపాఠం లాంటిది.

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తీసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.ఈ చిత్రానికి నిర్మించడానికి అయినా ఖర్చు కేవలం 50 లక్షలు రూపాయిలు మాత్రమే.దిల్ రాజు దీనికి నిర్మాత.కానీ కంటెంట్ లో ఎంతో బలం ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, చివరిగా తెలంగాణ గ్రామీణ సంస్కృతి, మరియు సంప్రదాయం వెండితెర మీద ఉట్టిపడింది, ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొన్నాయి.
మొదటి రోజు కేవలం 55 లక్షల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా , 16 రోజులకు గాను 16 కోట్ల 26 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.అంటే సగటున రోజుకి కోటి రూపాయలకు పైగానే వసూలు చేసింది అన్నమాట.ఇక ఆదివారం రోజున ఈ చిత్రానికి ఏకంగా కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
పాన్ ఇండియన్ చిత్రాలు కూడా ఈమధ్య కాలం లో ఇంతలాగా ఆడలేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.అలా 17 రోజులకు గాను ఈ సినిమా 17 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ మరియు 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది అట.రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా 20 కోట్ల రూపాయిల గ్రాస్, అలాగే పది కోట్ల రూపాయిల షేర్ ని కూడా అందుకోబోతుంది.కంటెంట్ పవర్ ఉన్న సినిమాకి లిమిట్స్ అనేవే లేదు అనడానికి ఒక ఉదాహరణగా నిల్చింది ఈ చిత్రం.