Balagam : ఓటీటీ వృద్ధి లోకి వచ్చిన తర్వాత ఈమధ్య కాలం లో తెలుగు సినిమాలు థియేటర్స్ లో మూడు వారాలకు మించి కూడా ఆడని పరిస్థితి ఏర్పడింది.అలాంటి ఈ స్లంప్ ఫేస్ లో కూడా కొన్ని సినిమాలు విమర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తూ 50 రోజులు మరియు వంద రోజులు పూర్తి చేసుకుంటున్నాయి.
రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘బలగం’ సినిమా కమర్షియల్ గా ఎలాంటి అద్భుతాలు సృష్టించిందో మన అందరికీ తెలిసిందే.ఎన్ని కొత్త సినిమాలు విడుదలైన ఈ చిత్రం రన్ మాత్రం ఆగడం లేదు.నెల రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు 50 రోజులకు దగ్గరలో ఉంది.ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా రన్ దాదాపుగా ముగిసిపోయినప్పటికీ, తెలంగాణ లో మాత్రం ఇంకా ఆడుతూనే ఉంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తెలంగాణాలో విడుదలైన అన్నీ కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.అంటే సుమారుగా 60 కేంద్రాల్లో అన్నమాట, ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని అద్భుతం అనే చెప్పాలి.ఇప్పటికీ ఈ సినిమా కొన్ని ప్రాంతాలలో వీకెండ్ అయితే చాలు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి.గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన #RRR చిత్రానికి కూడా ఇన్ని కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.సహజత్వానికి దగ్గరగా మన సంస్కృతి మరియు సంప్రదాయాలను నిజాయితీగా వెండితెర మీద చూపిస్తే ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృతమవుతాయో ఉదాహరణగా నిల్చింది బలగం చిత్రం.
రాబొయ్యే రోజుల్లో ఇలాంటి సినిమాలకు ఒక రేంజ్ డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ చిత్రానికి ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కమర్షియల్ గా ఇంత సక్సెస్ సాధించిన ఈ సినిమా అవార్డ్స్ విషయం లో కూడా అదే రేంజ్ చూపిస్తుందో లేదో చూడాలి.