https://oktelugu.com/

Bala Krishna: బాలకృష్ణ – గోపిచంద్ మలినేని మూవీ లో హీరోయిన్ ఫిక్స్… ఎవరంటే ?

Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ 107 వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమాను కంప్లీట్ చేసిన బాలయ్య… ఇప్పుడు గోపి చంద్ తో మూవీ కి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. వీరి కాంబోలో చేయనున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.  ఈ మేరకు దీపావళి కానుకగా తాజాగా నందమూరి అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చాడు గోపిచంద్. కాగా ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 4, 2021 / 10:12 PM IST
    Follow us on

    Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ 107 వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమాను కంప్లీట్ చేసిన బాలయ్య… ఇప్పుడు గోపి చంద్ తో మూవీ కి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. వీరి కాంబోలో చేయనున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.  ఈ మేరకు దీపావళి కానుకగా తాజాగా నందమూరి అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చాడు గోపిచంద్.

    కాగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు శృతిహాసన్ పోస్టర్ ను  మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు కూడా పూర్తయిందని సమాచారం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించగా… మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్​, టైటిల్ సాంగ్ ప్రోమో లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. మరో వైపు ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య ఓ టాక్​ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే పేరుతో నడుస్తున్న ఈ షోకు బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరించనున్నారు. నేటి నుంచి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

    https://twitter.com/MythriOfficial/status/1456253256556900365?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1456253256556900365%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fnews%2Fshrutihaasan-playing-lady-role-in-nbk107.html