Baby Movie Collections: రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం లాంటి వసూళ్లను రాబట్టిన ‘బేబీ’ చిత్రం ఇండస్ట్రీ లోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగా ఈమధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా ఆడితే వీకెండ్ వరకు లేదా రెండు వారాల వరకు ఆడుతున్నాయి. అది కూడా వీకెండ్స్ లో మాత్రమే, కానీ వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపే వసూళ్లను రాబట్టిన సినిమాలు మన టాలీవుడ్ లో చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి ఈమధ్య కాలంలో.
అలాంటి సినిమాలలో ఒకటి ‘బేబీ’. మొదటి రోజు ఎంత వసూళ్లు అయితే ఉన్నాయో, నిన్న అంతకు మించి ఉంది. ఇక ఈరోజు కూడా మొదటి రోజు వసూళ్లకు కాస్త అటు ఇటు గా ఉన్నట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ రేంజ్ మాస్ కొట్టుడు స్టార్ హీరో లు కూడా చెయ్యలేదని. అలాంటిది ఒక చిన్న సినిమా ఆ ఫీట్ ని అందుకుంది అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు ట్రేడ్ పండితులు.
ఇకపోతే ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి నేడు దాదాపుగా 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందట. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ చిత్రాల తర్వాత ఆరవ రోజు అంత వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనట. అలా ఆరు రోజులకు గాను ఈ చిత్రం 18 కోట్ల రూపాయలకు పైగా షేర్. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.
ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ బ్రో చిత్రం వరకు ఏ సినిమా లేదు కాబట్టి, ఈ చిత్రం ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాదిస్తుందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది అద్భుతం అనే చెప్పాలి.