Baahubali 3 Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చిన దర్శకుడు రాజమౌళి…బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. అప్పటివరకు తెలుగు సినిమా అంటే బాలీవుడ్ వాళ్ళు చాలా తక్కువ చేసి చూసేవారు… ఇక ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో అప్పటినుంచి మన సినిమాల స్టామినా ఏంటో వాళ్ళందరికి తెలిసిపోయింది. ఇక బాహుబలి సినిమా వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 31వ తేదీన సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన శోభు యార్లగడ్డ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా నిడివి గురించి ఆయన చాలా క్లారిటిగా చెప్పారు. 3 గంటల 40 నిమిషాల పాటు ఈ సినిమా ఉండనుందని మొదటి పార్ట్ ముగిసిన తర్వాత ఇంటర్వెల్ ఇస్తారట. సెకండ్ పార్ట్ ని ఇంటర్వెల్ తర్వాత నుంచి కంటిన్యూ చేస్తారట. మరి ఇంత నిడివి తో ప్రేక్షకులు సినిమాని చూస్తారా? 3 గంటల 46 నిమిషాలు నిడివితో వచ్చింది.
ఇక ఇప్పటి వరకు ఎక్కువ నిడివి ఉన్న సినిమా దాన వీరశూరకర్ణ కావడం విశేషం… ఇక ఆ సినిమా తర్వాత అంతటి రన్ టైమ్ ను కలిగి ఉన్న సినిమాగా బాహుబలి ఒక రికార్డు క్రియేట్ చేయబోతోంది… ఇక ఈ సినిమా ఎండింగ్లో ‘బాహుబలి 3’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇవ్వబోతున్నారు.
అలాగే కట్టప్ప నేపథ్యంలో బాహుబలి 3 సినిమా తెరకెక్కబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. మరి దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ ఏంటి అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొని తన సామ్రాజ్యంలోకి వచ్చారు. ‘మహిష్మతి’ సామ్రాజ్యానికి కట్టు బానిసలా ఎందుకు మారాడు అనేది ఆ సినిమా కథాంశంగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు బాహుబలి రీరిలీజ్ తో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. తద్వారా ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవ్వబోతోంది అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే…