Avika Gor: ప్రపంచంలో చీకటంతా ఏకమైనా ఒక్క దీపం వెలుగును ఏమాత్రం ఆపలేవు. అలాగే మనం ఎంచుకున్న లక్ష్యానికి సాధించాలన్న, పట్టుదల తోడైతే మన విజయాలను ఆపడం ఎవరి తరం కాదు. అందకే మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించాలి. మనల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించాలి. విజయం సాధించే క్రమంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, కన్నీళ్లు ఎదురవుతాయి, అవాంతరాలు అడ్డు తగులుతాయి. కష్టాలేవీ మన శత్రువులు కాదు. మన బలాలను, బలహీతల్ని తెలియజేసే నిజమైన మిత్రుడు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని కనిపెట్టాలన్నా ఆలోచన అక్కడి నుంచే పుట్టుకొస్తుంది. అసలు సమస్య లేకపోతే పరిష్కారమే ఉండదు కాబట్టి సమస్యను స్వీకరించడం చిన్ననాటి నుంచే మనం నేర్చుకోవాలి.
విజయం సాధించాలన్న నిర్ణయించుకున్న తర్వాత వెళ్తున్న దారి ఎలా ఉన్నా గమ్యం చేరుకోవాల్సిందే. జీవితం ఎప్పుడూ కూడా మనం ఎదురు చూస్తున్నట్లు, మనకు నచ్చినట్లు మారదు. మనమే మన జీవితాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోవాలి. ప్రయత్నిస్తే అది తప్పకుండా సాధ్యం అవుతుంది. మీరు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో ఎదురయ్యే మన అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గెలవాలన్న పట్టుదలతో పనిచేసిన ప్రతిసారి సత్ఫలితాలు వస్తాయని అనుకోవద్దు. ఏ పనీ చేయకపోతే అసలు ఏ ఫలితం రాదు కదా. దానికి కావాల్సింది ఓపిక. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీపిగా ఉంటుంది. ప్రయత్నించే క్రమంలో మన వెంట ఎవరూ తోడు లేకపోవచ్చు, ఎవరూ తోడు లేకపోయినా మనలో ఉన్న ధైర్యం మనల్ని కచ్చితంగా లక్ష్యం వైపు నడిపిస్తుంది. కాబట్టి ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టొద్దు.
లక్ష్య సాధనలో మనల్ని బాగా ఏది భయపెడుతుందో ఒకసారి కూర్చుని ఆలోచించాలి. దేనికైతే మనం ఎక్కువ భయపడతారో, దేనికైతే ఎక్కువగా వెనకడుగు వేస్తామో… అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి దానికి ఒక్కసారి ఎదురెళ్లి నిల్చోవాలి. అప్పుడే మన భయం పోతుంది. దీనివల్ల మన లక్ష్యసాధన కూడా సులువు అవుతుంది. లక్ష్యసాధనలో ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తుంది. ఎవరి కోసమో వేచి చూసే కన్నా మనం చేయగలిగింది చేసేయడమే. ఇతరుల మీద ఆశలు పెట్టుకుంటే విజయం ఆమడ దూరం వెనక్కి వెళ్తుంది. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధలను భరించే ఓర్పు, ఎప్పుడైతే మనలో వస్తయో ఉంటాయో… అప్పుడు జీవితంలో గెలవబోతున్నామని అర్థం. ఆ గెలుపు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గెలిచిన తర్వాత వచ్చే ఆనందం మనం అప్పటి వరకు పడ్డ బాధలను చెరిపేస్తుంది.
ఒకానొక సందర్భంలో సినీ నటి అవికాఘోర్ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. తన కెరీర్ తొలినాళ్లలో సినిమా ఛాన్సులు కోసం వెళితే అక్కడ తనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. అన్ని అగ్రిమెంట్స్ పూర్తయి సంతకాలు చేసి సినిమా ఓకే అయిందనుకుని సంతోషించే క్రమంలో అమెను ఆ వ్యక్తులు అందం ఒక్కటే సరిపోదని తన ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టారు. దీంతో తాను కన్న కలలు మళ్లీ కల్లలాయ్యాయి. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. చాన్నాళ్ల తర్వాత ఓ స్పీపర్ తన దగ్గరకు వచ్చి నా బిడ్డను కూడా మీలా చేయాలని అనుకుంటున్నాను అని చెప్పిన సందర్భంగా అవికా ఒక్కసారిగా ఏడ్చేసిందట. ఆమె పడ్డ బాధలన్నీ ఆ క్షణంలో మటుమాయమై.. తనను అవమానించే స్థాయి నుంచి తనను ఆదర్శంగా తీసుకునే స్థాయికి చేరుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Avika gor reveals interesting facts about her personal life
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com