‘Avatar – The Way of Water’ two days collection.. : ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన అవతార్ 2 చిత్రం నిన్న ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే..కానీ అవతార్ పార్ట్ 1 కి మరియు పార్ట్ 2 కి మధ్య 12 ఏళ్ళ గ్యాప్ రావడం వల్లో ఏమో తెలియదు కానీ, ఓపెనింగ్స్ మనం ఊహించిన రేంజ్ లో అయితే రాలేదు..ఈ 12 ఏళ్లలో మర్వెల్ మూవీస్ కి మంచి క్రేజ్ వచ్చింది.
![]()
ప్రపంచవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ఈ చిత్రాలు ప్రభంజనం సృష్టించేశాయి..వాటికి వచ్చిన వసూళ్లతో పోల్చి చూడడం వల్ల మనకి ఈ సినిమా ఓపెనింగ్స్ తక్కువ అనిపిస్తుండొచ్చు కాబోలు..మొదటి రోజు ఇండియా లో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..నార్త్ అమెరికా స్టేట్ లో ప్రీమియర్స్ నుండి 17 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 55 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ఇక రెండవ రోజు కూడా ఇదే తరహా ట్రెండ్ ని కనబర్చింది ఈ చిత్రం..ఇండియా లో రెండవ రోజు 38 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు..మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు కాస్త తగ్గాయి కానీ, నార్త్ ఇండియా లో మాత్రం మొదటి రోజు కంటే బాగానే వసూళ్లను రాబట్టింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పది కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..తెలుగు లో ఈ సినిమాకి దాదాపుగా స్టార్ హీరో రేంజ్ లో బిజినెస్ జరిగింది..వంద కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరిగి ఉంటుందని అంచనా..కానీ వసూళ్ల ట్రెండ్ చూస్తే అంత దూరం బాక్స్ ఆఫీస్ రన్ వచ్చేలా కనిపించడం లేదు..వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటేనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది..నార్త్ అమెరికాలో కూడా ఇదే పరిస్థితి..రెండు రోజులకు కలిపి అక్కడ ఈ సినిమాకి 90 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి..వీకెండ్ వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 500 మిలియన్ డాలర్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది.