Avatar 3 impact on Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని, వచ్చే నెల 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్, ట్రైలర్, మొదటి లిరికల్ వీడియో సాంగ్, ఇలా కావాల్సినంత కంటెంట్ మొత్తం బయటకు వచ్చేసింది. కానీ ఒక్క కంటెంట్ కూడా అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఫలితంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి వారం రోజులు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు లక్ష డాలర్ల మార్కు ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 1 మిలియన్ డాలర్లు కూడా రావడం కష్టం లాగా అనిపిస్తోంది.
కానీ సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి, రాబోయే రోజుల్లో ప్రమోషనల్ కంటెంట్ ని బట్టీ హైప్ పెరుగుతూ వెళ్తుందని, అప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని అన్ని ఫార్మట్స్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్దంగానే ఉన్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఐమాక్స్ వెర్షన్ కలెక్షన్స్ లో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ‘అవతార్ 3’ కూడా విడుదల అవుతుంది కాబట్టి IMAX వెర్షన్ స్క్రీన్స్ నెల రోజుల పాటు ఆ చిత్రానికి బుక్ అయ్యాయని, రాజా సాబ్ ని కేవలం స్టాండర్డ్ ఫార్మటు లోనే చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది ఈ చిత్రానికి చాలా గట్టి దెబ్బ అనే చెప్పొచ్చు. అయితే ఐమాక్ వెర్షన్ లేకపోయినా, 4dX,EPIQ, డాళ్బీ విజన్ వంటి ఫార్మట్స్ లో విడుదల అవుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
అవి కూడా సాధ్యమైనంత వరకు ‘అవతార్ 3’ కి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల చాలా గ్రాస్ మిస్ అవుతున్నామని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి రెండవ పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. మొన్న విడుదల చేసిన ‘రెబల్ సాబ్’ ప్రభాస్ ఇంట్రడక్షన్ కి సంబంధించిన పాట. ఇప్పుడు విడుదల చేయబోయే రెండవ పాట మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది. సంగీత దర్శకుడు తమన్ గతంలో ఎంతటి అద్భుతమైన మెలోడీ సాంగ్స్ ని అందించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు కూడా అదిరిపోయే రేంజ్ మెలోడీ ని రెడీ చేసి ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ రెండవ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది.