Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఇమేజ్ తెలిసిందే. బుధవారం తెల్లవారు జామున మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్ను మూశారు. దీంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించారు. అందరు శోకసంద్రంలో ఉన్న సమయంలో ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. మహేశ్ బాబు ఇంట్లో దొంగతనం చేయాలని ఓ వ్యక్తి ప్రయత్నించడం సంచలనం కలిగించింది. జనవరిలో అన్న దూరం కావడం ఇప్పుడు తల్లి లేకుండా పోవడంతో మహేశ్ బాబు విచారంగా ఉన్న సమయంలో ఇలాంటి వార్త ఆయనను మరింత కలవరపాటుకు గురి చేసిందనే చెప్పాలి.

మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పుడు తల్లి మరణంతో ఓ పదిహేను రోజులు షూటింగ్ కు విరామం ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఆయన ఇంట్లో దొంగతనం కోసం ఓ వ్యక్తి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందిరాదేవి బుధవారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. కానీ ఆ దొంగ మంగళవారం రాత్రే వచ్చినట్లు చెబుతున్నారు. మహేశ్ బాబు జూబ్లిహిల్స్ రోడో నెంబర్ 81లో నివాసం ఉంటున్నారు.

ఆయన ఇంటి ప్రహరీ పది అడుగుల ఎత్తు ఉంటుంది. మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చిన ఓ వ్యక్తి సమీపంలోని ఓ నర్సరీలో పనిచేస్తున్నాడు. మహేశ్ ఇంటికి దొంగతనం కోసం వచ్చి గోడ దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. మూలుగులు వినిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడు కోలుకున్నాక విచారించాలని చూస్తున్నారు. నిందితుడు ఒడిశాకు చెందిన కృష్ణ అని తెలిసింది.
[…] […]