Bigg boss Sunny: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కలేదు..చిన్నా పెద్ద అని తేడా లేకుండా ఈ రియాలిటీ షో కోసం ప్రతి ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు..ఇప్పటికే 5 సీసన్స్ మరియు ఒక OTT వెర్షన్ సీసన్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో త్వరలోనే ఆరవ సీసన్ ని కూడా ప్రారంబించుకోబోతుంది..ఎంతో మంది సెలెబ్రెటీలకు ఈ రియాలిటీ షో జీవితంని ఇచ్చింది..ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ కూడా రాని గుర్తింపు కేవలం ఈ రియాలిటీ షో లో కాంటెస్ట్ చేసిన తర్వాత ఆ గుర్తింపుని రప్పించుకున్న సెలెబ్రిటీలు ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉన్నారు..వారిలో వీజే సన్నీ కూడా ఒక్కడు..బిగ్ బాస్ సీసన్ 5 లో అద్భుతంగా ఆడి అశేష ప్రజాభిమానం సంపాదించుకున్న సన్నీ ఇప్పుడు టాలీవుడ్ లో హీరో గా వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు..ప్రస్తుతం ఆయన ‘ఎటిఎం’ అనే సినిమా షూటింగ్ లో బిజీ గా గడుపుతున్నాడు..ఈ సినిమా షూటింగ్ నిన్న హైదరాబాద్ లోని హస్తినాపురం లో జరిగింది..అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో చోటు చేసుకున్న ఒక్క సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Vallabhaneni Vamsi: గన్నవరంలో ‘మట్టి’ మంటలు.. వంశీకి చుక్కలు చూపిస్తున్న ప్రత్యర్థులు
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో సాయంత్రం పూట ఒక్క రౌడీ షీటర్ షూటింగ్ స్పాట్ కి వచ్చి VJ సన్నీ మీద దౌర్జన్యం చెయ్యడం ప్రారంభించాడు..లొకేషన్ లో ఉన్నవాళ్లు మొత్తం ఇది ప్రాంక్ ఏమో అని అనుకున్నారు..కానీ సన్నీ మీద అతను చెయ్యి చేసుకోవడం తో సెక్యూరిటీ స్టాఫ్ అలెర్ట్ అయ్యి అతనిని కార్ ఎక్కించి ఇంటికి పంపేశారు..ఇంతకీ అతను ఎవరు..అతనికి సన్నీ కి మధ్య గొడవ ఏమిటి..?, ఎందుకు అతను సన్నీ మీద చెయ్యి చేసుకునే పరిస్థితి ఏర్పడింది వంటి విషయాలు తెలియాల్సి ఉంది..ప్రస్తుతం సన్నీ ఆ రౌడీ షీటర్ పై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు..కెరీర్ పారరంభం లో వీజే గా, జర్నలిస్ట్ గా మరియు సీరియల్ ఆర్టిస్ట్ గా పని చేసిన సన్నీ, బిగ్ బాస్ రియాలిటీ షో చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఆయన ‘అన్ స్టాపబుల్’ ,’ఎటిఎం’ వంటి సినిమాల షూటింగ్స్ లో బిజీ గా ఉన్నాడు..వీటితో పాటు ఇంకో కొత్త సినిమా కూడా కమిట్ అయ్యి ఉన్నాడు..105 రోజుల పాటు బిగ్ బాస్ షో లో అద్భుతంగా ఆడి 50 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ మరియు సువర్ణ భూమి వారి వెంచర్స్ లో 25 లక్షల రూపాయిలు విలువ చేసే ఫ్లాట్ ని గెలుచుకున్న సంగతి మన మనందరికీ తెలిసిందే.

Also Read: YSRCP Rajanna Canteens: ఇలా కూడా కటుపుకొట్టారన్న మాట.. క్యాంటీన్ల కథ కంచికేనా?