Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై సంచలన కామెంట్స్ చేశాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరింత దుర్భరం.. మానుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో మంటలు రగిలించాయి. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ వేణు స్వామిపై మండి పడుతున్నారు.

జనసేన ఆవిర్భావం జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తుంది. ఇప్పటికి కూడా ఆ పార్టీకి ఆర్గనైజ్డ్ క్యాడర్ లేదు. పవన్ తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆయనపై జనాల్లో నమ్మకం సన్నగిల్లేలా చేశాయి. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు దాడి చేసిన ఆయన… 2014 ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు.
2019 ఎన్నికల నాటికి బాబుపై ఆయన అభిప్రాయం మారిపోయింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయనతో విడిపోయి,మరలా విమర్శించడం మొదలుపెట్టారు. అదే సమయంలో టీడీపీతో కలిసి ఉన్నప్పుడు బీజేపీని, మోడీని తిట్టిపోసిన పవన్… 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన వెంటనే మోడీ నామస్మరణ చేస్తూ… ఆ పార్టీ మిత్రపక్షంగా మారారు.
టీడీపీ, బీజేపీ వంటి పార్టీలకు వ్యతిరేకమైన సిపిఐ, సిపిఎం వంటి వామపక్ష పార్టీలతో కొన్నాళ్ళు దోస్తీ చేశాడు. పవన్ నిలకడ లేని నిర్ణయాలు, సందర్భానుసారంగా మారే మాటలు ఆయనను బలమైన శక్తిగా మార్చలేక పోతున్నాయి. ఇవన్నీ అటుంచితే వేణు స్వామి తాజా కామెంట్స్ ఆయన అభిమానుల ఆశలు సన్నగిల్లేలా చేశాయి.
అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగడం కష్టమే అంటూ ఆయన బాంబు పేల్చారు. పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని, నిలకడలేని స్వభావమని, ఒకవైపు సినిమాలు అంటారు మరోవైపు రాజకీయాలు అంటారు. ఆయన జాతకమే అంత. 2024 తర్వాత పవన్ రాజకీయాలలో ఉండరని పవన్ జాతకం చెబుతుందని వేణు స్వామి గట్టిగా వక్కాణించారు.
Also Read: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకు ఘన నివాళి అర్పించిన గూగుల్… ఎమోషనల్ ట్వీట్
ఇక పవన్ ఫ్యాన్స్ నన్ను ఏమైనా చేస్తారనే భయం నాకు లేదని, ఆయన జాతకం ఎలా ఉందో అదే చెప్పాను, అన్నారు. కాగా జగన్ మరో మూడు పర్యాయాలు సీఎం అవుతారని చెప్పడం కొసమెరుపు.
2019 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు ఓడిపోతారని వేణు స్వామి చెప్పారు. సమంత-చైతు విడాకులు, అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేకప్ వంటి అంచనాలు నిజం కాగా… వేణు స్వామి తాజా కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.