Ashish Vidyarthi ex wife : నటుడు ఆశిష్ విద్యార్థి రెండో వివాహం సంచలనమైంది. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి 33 ఏళ్ల రూపాలి బారువాను వివాహం చేసుకున్నారు. ఈ విలక్షణ జంట గురించి ఇండియా మొత్తంగా ప్రముఖంగా చెప్పుకుంటుంది. మొదటి భార్యకు విడాకులిచ్చిన ఆశిష్ విద్యార్థి తన కంటే వయసులో అత్యంత పిన్న వయస్కురాల్ని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో విడాకులు అయ్యాయని ఆయన నేరుగా చెప్పారు. విడిపోయినప్పటికీ ఆమెతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు.
ఆశిష్ విద్యార్థి-రూపాలి బరువా వివాహంపై ఆయన ఫస్ట్ వైఫ్ రజోషి ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తామిద్దరూ విడిపోయి చాలా కాలం అవుతుందని ఆమె తెలియజేశారు. చెప్పాలంటే 22 ఏళ్ల క్రితమే విడిపోయారట. అధికారికంగా విడాకులు తీసుకోలేదట. పరస్పర అవగాహనతో విడాకులు తీసుకున్న పక్షంలో ఒకరిపై మరొకరికి ఎలాంటి కోపం, ద్వేషం లేవని ఆమె మాటలను బట్టి తెలుస్తుంది.
ఆశిష్ విద్యార్ధి ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఆయన ఇండియా వైడ్ తిరుగుతూ స్ట్రీట్ ఫుడ్ వీడియోలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మాజీ భార్య రజోషితో హ్యాపీగా ఉన్న వీడియో షేర్ చేశారు. ఇంతలోనే ఏమైందని అందరూ సందేహం పడ్డారు. దానికి కారణం… వారు విడిపోయి ఏళ్ళు గడుస్తుంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రజోషి ఇంకా మాట్లాడుతూ… మా దారులు వేరయ్యాయి. ఆయన సక్సెస్ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. నేను ఆయన భార్యగా కొన్ని బాధ్యతలు నెరవేర్చలేనని అనిపించింది. ఎప్పటి నుండో చేయాలనుకున్న పనులు ఇప్పుడు నెరవేరుస్తున్నాను అన్నారు.
ఆశిష్ విద్యార్ధి రెండో వివాహం అనంతరం ఆమె నిఘాడంగా కొన్ని సందేహాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితమనే ఫజిల్ లో తికమక పడకు, అని ఒక కోట్ పెట్టారు. మరో సందేశంలో అర్థం చేసుకునేవాడు నిన్ను ప్రశ్నించడు, నిన్ను బాధపెట్టే పనులు చేయడు ఇది గుర్తించుకో అని ఆమె రాసుకొచ్చారు. ఇవి ఆశిష్ విద్యార్థిని ఉద్దేశించే చేశారని కొందరి వాదన. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడని సమాచారం. అతడు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడట.