Ali: మూడు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను నవ్విస్తున్న అలీ కామెడీ అంటే అందరికీ ఇష్టమే. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన కమెడియన్ గా.. హీరోగా.. వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. ఇప్పుడు బుల్లితెరపై ప్రత్యేక షోలో అలరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆల్రౌండ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆలీ నిర్మాతగా ఇటీవల ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి..’ అనే సినిమా వచ్చింది. ఇందులో అలీ కూడా నటించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో అందులోని నటులు నరేశ్, పవిత్రా లోకేశ్ లతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు ఆలీ. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలపై ఓపెన్ అయ్యాడు. ఒక సందర్భంలో భార్య పక్కన ఉండగానే వేరే అమ్మాయితో ఫస్ట్ నైట్ సీన్ చేయాల్సి వచ్చిందని చెప్పడం సంచలనంగా మారింది.

‘ప్రెసిడెంట్ పేరమ్మ’ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆలీ ఆ తరువాత ‘సీతా కొక చిలుక’ సినిమాతో గుర్తింపు వచ్చింది. ఇక ‘యమలీల’ సినిమాతో ఆలీ హీరో అయ్యాడు. ఆ తరువాత వచ్చిన ప్రతీ అవకాశాన్నివదలకుండా సినిమాల్లో నటిస్తూ స్టార్ కమెడియన్ అయ్యారు. మూడు దశాబ్దాల పాటు ఎందరో కమెడియన్లు వచ్చారు.. వెళ్లారు.. కానీ ఆలీ మాత్రం కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన స్టార్ హీరో కాకపోయినా అంతకుమించి గుర్తింపు వచ్చింది. ఈ తరుణంలో ఆలీ సొంతంగా ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి..’ సినిమా తీసే నిర్మాతగా ఎదిగాడు.
ఈ సందర్భంగా నరేశ్-పవిత్రా లోకేశ్ లతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఆలీ తన గురించి చెప్పాడు. ‘నేను ఓ సినిమా షూటింగ్ లో భాగంగా మౌర్యతో ఫస్ట్ నైట్ సీన్ చేయాల్సి వచ్చింది. అదే రోజు మా మ్యారేజ్ డే. అయితే డైరెక్టర్ నా భార్య, పిల్లలను షూటింగ్ స్పాట్ కు తీసుకొచ్చి నాతో కేక్ కట్ చేయించాడు. ఆ తరువాత వారు అక్కడే ఉండగానే ఫస్ట్ నైట్ సీన్ చేయాల్సి వచ్చింది. వాళ్ల ముందు ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీలయ్యా..’ అని అన్నాడు.

దీంతో నరేశ్ కల్పించుకొని ‘నువ్వు ఒరిజినల్ ఫస్ట్ నైట్ షూటింగ్ గ్యాప్ లోనే ముగించేశావట కదా.. నిజమేనా..?’ అని అన్నాడు. అయితే ఆలీ వెంటనే మాట్లాడుతూ ‘నిజమే.. నేను ముద్దుల ప్రియుడు షూటింగ్ లో ఉండగా మ్యారేజ్ అయింది.. ఆ తరువాత రాఘవేంద్రరావు గారు వెంటనే రమ్మనడంతో భార్య, అమ్మను తీసుకొని హైదరాబాద్ కువచ్చాను. షూటింగ్లో రెండు గంటల గ్యాప్ దొరికింది. ఈ సమయంలోనే ఫస్ట్ నైట్ జరిగింది.. ’ అని ఆలీ చెప్పడంతో ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.