Pushpa 2: మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ విడుదల కాబోతోంది. 48 గంటల క్రితమే ఈ సినిమా పెద్ద రికార్డులను బద్దలు కొట్టింది. సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా 100 కోట్ల రూపాయలను దాటేసింది. అయితే ఈ సినిమా 3డి వెర్షన్ డిసెంబర్ 5న విడుదలకానుంది. కాగా, ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ కు కూడా సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత వారం అంటే నవంబర్ 28న ‘పుష్ప 2’ తెలుగు వెర్షన్‌ను CBFC ఆమోదించింది. ఇప్పటికే ఈ సినిమా రన్‌టైమ్ వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే సినిమాలో కొన్ని కట్స్ కూడా పెట్టారు. తెలుగు తర్వాత ఇప్పుడు హిందీ వెర్షన్ కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్‌ను రాబట్టింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఈ సంఖ్య చాలా పెద్దది. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇండియాలో 62.22 కోట్ల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టింది. తెలుగు 2డి వెర్షన్‌లో గరిష్ట టిక్కెట్ బుకింగ్ పూర్తయింది. 33 కోట్లకు పైగా ఇంప్రెషన్స్ వచ్చాయి. హిందీ వెర్షన్ కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పటి వరకు రూ.23.92 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. తమిళం, కన్నడ, మలయాళంలో కూడా అడ్వాన్స్ బుకింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబరు 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉన్న గణాంకాలివి.
నిర్మాతలను సెలక్టెడ్ థియేటర్లలో నేడు పుష్ప-2 బెనిఫిట్ షోలను వేయనున్నారు. అయితే పుష్ప రిలీజ్ ఆపాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ పుష్ప 2 సినిమాలో చూపించింది అంతా అబద్ధమని ఆయన అంటున్నారు. బయట ఎర్రచందనం రూ.10 లక్షలుంటే సినిమాలో రూ.కోటిలాగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యువకులు లక్షలాది చెట్లను నరికేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు పుష్ప-2తో ఇంకెన్ని చెట్లు నరికేస్తారోనని తాను ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమా కారణంగా యువత పాడవుతోందన్నారు. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ లను అరెస్టు చేసి, జైల్లో వేయాలంటూ ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రేపే పుష్ప 2 రిలీజ్ ఉంది.. కాబట్టి చూడాలి ఏం జరుగబోతుందో.
కాగా ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, టీజర్ సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదల మాస్ బీట్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అలాగే శ్రీలీల మీద తెరకెక్కించిన కిస్సిక్ సాంగ్ కూడా యూట్యూబ్ లో ట్రెండింగులో ఉంది. ఈ సినిమాలో ఫాహిద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా చాలా గ్రాండ్ గా తెరకెక్కించింది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Armor bjp mla paidi rakesh reddy is demanding to stop the pushpa 2 release
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com