Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు ఇంటి సబ్యులకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు. అయితే ఎనిమిది మందితో మొదలైన ఈ రేస్ ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. ఫినాలే రేస్ కి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది టాస్క్ లు నిర్వహించారు బిగ్ బాస్. కాగా తక్కువ పాయింట్లు సాధించి స్కోర్ బోర్డు లో లీస్ట్ నిలిచిన శోభా, శివాజీ, ప్రియాంక, యావర్ లు రేస్ నుంచి తప్పుకున్నారు.
ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్, గౌతమ్ లు రేస్ ఉన్నారు. కాగా పాయింట్స్ పట్టికలో వెనుక బడిన గౌతమ్ రేస్ నుంచి తప్పుకున్నాడు. తాను సాధించిన పాయింట్స్ లో 140 పాయింట్లు అమర్ దీప్ కి ఇచ్చాడు. దీంతో అమర్ 1000 పాయింట్స్ తో ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళాడు. తర్వాత జరిగిన గేమ్స్ లో అర్జున్ సత్తా చాటాడు. దీంతో ప్రశాంత్ కూడా రేసు నుండి తప్పుకున్నాడు. టికెట్ టు ఫినాలే కోసం అమర్-అర్జున్ పోటీపడ్డారు. చివరి టాస్క్ లో అర్జున్ విజయం సాధించి మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు.
అయితే నామినేషన్లో ఉన్న అర్జున్ ఎలిమినేషన్ నుండి తప్పించుకోవాలి. అప్పుడు డైరెక్ట్ గా ఫినాలే కి వెళ్ళిపోతాడు. అదే జరిగితే టాప్ 5 లెక్కలు మారిపోతాయి. శివాజీ, ప్రశాంత్, అమర్, ప్రియాంక లు టాప్ 5 లో ఉంటారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గౌతమ్, యావర్, శోభా లో ఒకరు ఫైనల్ లో ఉంటారనే వాదన కూడా ఉంది. దీంతో 13 వ వారం ఎలిమినేషన్ కీలకంగా మారింది.
ఒకవేళ అర్జున్ ఎలిమినేట్ అయితే .. అంత కష్టపడి సాధించిన ఫినాలే అస్త్ర వృధా అయిపోతుంది. సేవ్ అయ్యి టాప్ 5 కి వెళ్తే .. కొంత మందికి షాక్ తప్పదు. ఏదైనా జరగొచ్చు చెప్పలేం. బిగ్ బాస్ స్టీరింగ్ ఎటు కావాలంటే అటు తిప్పేస్తుంటాడు. చూడాలి ఇక టాప్ లో ఎవరు ఉంటారనే అంశంపై ఈ వారం ఎలిమినేషన్ తర్వాత క్లారిటీ రావొచ్చు.