Bigg Boss 7 Telugu: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ఫీవర్ నడుస్తుంది. టైటిల్ ఎవరి సొంతం అవుతుందని బిగ్ బాస్ లవర్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. మూడు నెలలుగా నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేసిన రియాలిటీ షో చివరి దశకు చేరింది. మొత్తం 19 మంది సీజన్ 7లో కంటెస్ట్ చేశారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. 14వ వారం శోభ శెట్టి ఎలిమినేట్ అయ్యింది. మిగిలిన శివాజీ, అమర్, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, యావర్ లను నాగార్జున ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు.
సాధారణంగా ఫైనల్ కి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే వెళతారు. ఆరో కంటెస్టెంట్ ఫైనల్ వీక్ లో అడుగుపెడితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. సీజన్ 6లో శ్రీసత్య మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యింది. సింగర్ రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ ఫైనల్ కి వెళ్లారు. అయితే ఈ సీజన్ కి మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదని తెలుస్తుంది. ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ కి పంపారు. అర్జున్ మొదటిగా ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది.
అర్జున్ 13వ వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఫినాలే అస్త్ర గెలిచిన నేపథ్యంలో నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. ఈ కారణంతోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా లేకుండా చేశారని సమాచారం. ఏది ఏమైనా అర్జున్ టాప్ 5 నుండి తప్పుకున్నాడు. అతడు టైటిల్ పోరులో లేడు. అర్జున్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. షో మొదలైన 5 వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం మైనస్ అయ్యింది. లేదంటే ఖచ్చితంగా టైటిల్ ఫేవరేట్స్ లో ఒకడిగా ఉండేవాడు.
మీనీ లాంచ్ ఈవెంట్లో… పల్లవి ప్రశాంత్, శివాజీ స్ట్రాంగ్ ప్లేయర్స్, వారితో పోటీ పడేందుకు ట్రై చేస్తానని అర్జున్ అన్నాడు. టాస్క్ లలో వంద శాతం ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. అర్జున్ లో నచ్చిన మరొక విషయం మొహమాటం లేకుండా ఉన్నది మాట్లాడేవాడు. అందుకే నాగార్జున తరచుగా అర్జున్ ఒపీనియన్ అడుగుతాడు. కాగా అర్జున్ 10 వారాలు హౌస్లో ఉన్నాడు. వారానికి రూ. 2.45 లక్షల ఒప్పందంతో అర్జున్ హౌస్లో అడుగుపెట్టాడట. ఆ లెక్కన అర్జున్ రూ.24.5 లక్షలు రెమ్యూనరేషన్ గా అందుకున్నాడు.