Homeఎంటర్టైన్మెంట్Ariyana Glory: అనిల్ రావిపూడి, సునీల్ పై అరియానా తిట్లదండకం: దొంగసచ్చినోళ్లు అంటూ...

Ariyana Glory: అనిల్ రావిపూడి, సునీల్ పై అరియానా తిట్లదండకం: దొంగసచ్చినోళ్లు అంటూ…

Ariyana Glory: బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ ఫంక్షన్ సందడిగా సాగింది. ఈ ఈవెంట్లోకి ‘ఎఫ్ 3’ మూవీ యూనిట్ సభ్యులు రావడంతో కంటెస్టెంట్లు ఫుల్ హ్యాపీ అయ్యారు. ఈ సందర్భంగా ఎఫ్ 3’ దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు సునీల్ లు వచ్చి కంటెస్టెంట్ అరియానాతో కామెడీ చేశారు. ఆమెకు ప్రైజ్ మనీ ఇచ్చే విషయంలో నవ్వులు పూయించారు. అరియానాను ఆటపట్టిస్తూ చేసిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఒక దశలో అరియానా కాస్త కోపం తెచ్చుుకొని దర్శకుడు అనిల్ రావిపూడి, సునీల్ పై తిట్ల దండకం మొదలుపెట్టింది. కానీ ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని మదనపడింది. ఇంతకీ వారిద్దరిని అరియానా ఎందుకు తిట్టినట్లు..?

Ariyana Glory
Ariyana Glory

మరికాసేపట్లో బిగ్ బాస్ విజేతను ప్రకటించే సందర్భంగా వేదికపైకి హోస్ట్ నాగార్జున వచ్చారు. సిల్వర్ సూట్ కేసును అనిల్ రావిపూడికి ఇచ్చి కంటెస్టెంట్ ను మెప్పించి బయటకు తీసుకురావాలని కోరారు. దీంతో హౌస్ లోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి ఎవరైనా ఇంటినుంచి బయటకు వస్తారా..? అని అడుగుతాడు. అయితే అక్కడే ఉన్న అరియానా ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్’ అంటూ అనిల్ రావిపూడికి కాంప్లిమెంట్ ఇచ్చింది. వెంటనే నాగార్జున జోక్యం చేసుకొని సునీల్ అందంగా లేడా..? అని అనగానే.. వెంటనే సునీల్ అందాల రాముడు అని చెప్పింది. ఆ తరువాత నాగార్జున అడిగిన ప్రశ్నలకు అరియానా సమాధానం ఇచ్చింది. ‘నేను డబ్బు కోసమే హౌస్ లోకి వచ్చాను.. నాకు డబ్బు అవసరం చాలా ఉంది..’ అని అంటుంది. దీంతో అనిల్ రావిపూడి తెచ్చిన సూట్ కేసును తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది.

Also Read: Bigg Boss Winner Bindu Madhavi: బిగ్ బాస్ విజేతగా ఆడపులి ‘బిందు’..తొలి మహిళగా సంచలనం

సూట్ కేసుతో వేదికపైకి రాగానే అరియానాను.. నాగార్జున, అనిల్ రావిపూడి, సునీల్ లుఆటపట్టించారు. ఆ సూట్ కేసులో డబ్బు లేదని అన్నారు. అది ఖాళీ సూట్ కేస్ అని చెప్పారు. దీంతో ‘నేను అనిల్ రావిపూడి మాటలు నమ్మాను’ అని చెబతుంది. వెంటనే బిగ్ బాస్ ఆర్గనైజర్ చెప్పమన్నది చెప్పాం.. అని అనడంతో అరియానా షాక్ తిన్నది. ఆ తరువాత ‘నన్ను మాటలతో మోసగించారు ఈ దొంగ సచ్చినోళ్లు..’ అని తిట్ల దండకం మొదలుపెట్టింది. వెంటనే అనిల్ రావిపూడి కలగజేసుకొని డబ్బు మహత్యం అలా ఉంటుంది.. అని అన్నాడు. వెంటనే అరియానా.. డబ్బు లేకపోతే నేను కిందపడిపోతాను.. అని అంది. ఈ సమయంలో బాబా భాస్కర్ కలగజేసుకొని అందులో రూ.500 మాత్రమే ఉన్నాయనడంతో మరింత డీలా పడింది.

Ariyana Glory
Anil Ravipudi, Sunil

అలా కాసేపు ఏడించిన తరువాత నాగార్జున మాట్లాడుతూ ఒకటి పక్కన ఆరు సున్నాలు వేసుకో.. అని అన్నాడు. అంటే రూ.10 లక్షలు ఉన్నాయనడంతో అరియానా ఎగిరి గంతేసింది. ఆ తరువాత అనిల్ రావిపూడికి హగ్ ఇచ్చింది. నాగార్జున కాళ్లకు నమస్కరించింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అరియానా బిగ్ బాస్ షో నుంచి చాలా నేర్చుకున్నదన్నారు. ఆ తరువాత రూ.10 లక్షల సూట్ కేసును అరియానాకు అందించారు.

Also Read:Bigg Boss Nonstop: బిగ్ బాస్ నుంచి అనిల్, బాబా భాస్కర్ ఎలిమినేటెడ్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular