https://oktelugu.com/

Koratala Siva: త్వరలోనే కొరటాల శివ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా?? ఆ హీరోతోనే ఆఖరి సినిమా?

Koratala Siva: మన టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా నిలిచిన డైరెక్టర్ కొరటాల శివ..ఒక్కప్పుడు కథ మరియు మాటల రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని..ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో విభేదాలు ఏర్పడి ఇక నుండి నేను ఒక్కరి కింద పని చెయ్యను..డైరెక్టర్ గా నా దగ్గర సిద్ధంగా ఉన్న పది స్క్రిప్ట్స్ తో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతాను అని శపధం చేసి ఎంతో కసి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 25, 2022 / 05:30 PM IST
    Follow us on

    Koratala Siva: మన టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా నిలిచిన డైరెక్టర్ కొరటాల శివ..ఒక్కప్పుడు కథ మరియు మాటల రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని..ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో విభేదాలు ఏర్పడి ఇక నుండి నేను ఒక్కరి కింద పని చెయ్యను..డైరెక్టర్ గా నా దగ్గర సిద్ధంగా ఉన్న పది స్క్రిప్ట్స్ తో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతాను అని శపధం చేసి ఎంతో కసి పట్టుదల తో స్టార్ డైరెక్టర్ అయ్యాడు కొరటాల శివ..ఆయన అనుకున్నట్టు గానే ఇప్పటి వరుకు తీసిన 5 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..మిర్చి సినిమా తో ప్రారంభం అయినా ఆయన బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర భరత్ అనే నేను సినిమా వరుకు కొనసాగింది..ఇక ఈ నెల 29 వ తేదీన విడుదల అవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో ఆ జైత్ర యాత్ర కొనసాగబోతుంది.

    Koratala Siva

    ఇది ఇలా ఉండగా కొరటాల శివ కి సంబంధించిన ఒక్క లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అదేమిటి అంటే కొరటాల శివ ఇక కేవలం నాలుగు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తాడు అని..ఆ తర్వాత డైరెక్షన్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి..ఈ మాట స్వయంగా కొరటాల శివ గారే తన సన్నిహతుల సమక్షం లో చెప్పారట..నేను నా వద్ద ఉన్న పది స్క్రిప్ట్స్ కి మాత్రమే దర్శకత్వం వహించాలి అని అనుకున్నాను అని, ఇప్పటికే 6 స్క్రిప్ట్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసాను అని..ఇక మిగిలిన నాలుగు స్క్రిప్ట్స్ లో ఒక్కటి ఎన్టీఆర్ తో ఇంకోటి అల్లు అర్జున్ తో తీస్తాను అని..మిగిలిన రెండు స్రిప్ట్స్ కి హీరోలు ఎవరో ఇంకా ఏమి ఆలోచించలేదు అంటూ చెప్పుకొచ్చాడు అట కొరటాల శివ..ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

    కొరటాల శివ ద్రుష్టి ఈమధ్య మొత్తం నిర్మాణ రంగం వైపు వెళ్తోంది అట..పది సినిమాలు పూర్తి అయినా తర్వాత ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు అని తెలుస్తుంది..కొరటాల శివ శ్రీమంతుడు సినిమా నుండి దర్శకుడిగా రెమ్యూనరేషన్స్ తీసుకోవట్లేదు..రెమ్యూనరేషన్ కి బదులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను నిర్మాతలను అడిగి తీసుకుంటాడు అట..అలా తెలివైన నిర్ణయం తీసుకున్న కొరటాల శివ భారీ లాభాలనే ఆర్జించాడు..ఇప్పటి వరుకు తీసిన సినిమాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడం కూడా ఆయన అదృష్టం అని చెప్పాలి..ఇప్పుడు ఆయన లేటెస్ట్ సినిమా ఆచార్య కి కూడా రెమ్యూనరేషన్ బదులుగా ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ఏరియాల వరుకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది..మరి కోతల శివ అదృష్టం ఆచార్య సినిమా తో కూడా కొనసాగుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

    Tags