Bigg Boss 9 top 5 contestants: టెలివిజన్ రంగంలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్… ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం తొమ్మిదోవ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ ముందుకు సాగుతోంది… ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరి కొంతమంది హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. భరణి, శ్రీజ లాంటి కంటెస్టెంట్స్ ఒకసారి ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ హౌస్ లోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది… ఈ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే నాగార్జున ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే ఈ సీజన్ లో కూడా చాలా ట్విస్ట్ లు టర్న్ లతో ముందుకు సాగుతోంది. గత సీజన్ల కంటే కూడా ఈ సీజన్ కి ఎక్కువ ఆదరణ రావడంతో బిగ్ బాస్ యాజమాన్యం కొంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ వారం దివ్వెల మాధురి ఎలిమినేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు ఆడుతున్న టాస్క్ లను బట్టి వాళ్లకు జనాల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే టాప్ 5 లో చోటు దక్కించుకునే కంటెస్టెంట్స్ ఎవరో ఒక క్లారిటీ వచ్చేసింది. టాప్ 5 లో తనూజ, సంజన, డీమాన్ పవన్, ఇమ్మానియేల్, పవన్ కళ్యాణ్ ఐదుగురు టాప్ 5 లో నిలిచే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్లకు జనాల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తోంది.
అలాగే వీళ్ళు ఆడే టాస్కులను కూడా జన్యూన్ గా ఉండడంతో బిగ్ బాస్ సైతం వీళ్ళకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక రాబోయే రోజుల్లో టాప్ 5 లిస్ట్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ 95% వీళ్లు ఐదుగురికే టాప్ 5 లో నిలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి…
ఇక వీళ్ళందరిలో టాప్ వన్ గా నిలిచేది ఎవరు ఈ సీజన్ ట్రోఫీ ని అందుకునేది ఎవరు అనే దాని మీద కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. మొత్తానికైతే బిగ్ బాస్ గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కి కొంత ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సెలబ్రిటీలను, కామన్ మ్యాన్స్ ను కలిపి ఎంటర్ టైన్ చేస్తున్నారు కాబట్టి ఈ సీజన్ అన్ని సీజన్లను మించి ఎక్కువ వ్యూయర్ షిప్ ను నమోదు చేసుకుంటుంది…