Kishkindhapuri Movie Minus Scenes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెల్లంకొండ శ్రీనివాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ గా చాలా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. ఇక రాక్షసుడు సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ సినిమా తర్వాత కమర్షియల్ సినిమాలు చేసినప్పటికి అవేవీ సక్సెస్ ని సాధించలేదు. ఇక మొదటిసారి హార్రర్ థ్రిల్లర్ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ‘కిష్కింధపురి’ అనే సినిమాని చేశాడు. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి హైప్ ను క్రియేట్ చేసింది. హార్రర్ తో కూడిన సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. వాటిని కూడా చాలా సెటిల్డ్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొంతవరకు బెస్ట్ అటెంప్ట్ అనే చెప్పాలి.
ఓవరాల్ గా సినిమా బాగున్నప్పటికి ఫస్ట్ ఆఫ్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడికి అంతగా నచ్చలేదు. ముఖ్యంగా హైపర్ ఆది తో కామెడీని ట్రై చేయించే ప్రయత్నం చేశారు కానీ అది అంతగా పేలలేదు. ఇక సెకండాఫ్ లో దెయ్యానికి సంబంధించిన సీన్స్ సైతం చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నప్పటికీ తెర మీద అంత బాగా ప్రజెంట్ చేయలేకపోయారు…
అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టరైజేషన్ ను మలిచిన విధానం పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. మరి మొత్తానికైతే ఈ సినిమాలో ఇవి మైనస్ గా మారాయి. వీటిని కనక ప్లస్ పాయింట్ గా మార్చి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఇక స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి మరికొన్ని విషయాల్లో మాత్రం ఆయన చాలావరకు లాజిక్స్ ను వదిలేశాడు.
ఇక థ్రిల్లర్ సినిమాల్లో లాజిక్స్ పెద్దగా పట్టించుకోనవసరం లేదు అని చెప్పినప్పటికి ఈ సినిమాలో కూడా వాటిని వదిలేశారు. ఈ సినిమాలో శ్రీనివాస్ ప్రజెంటేషన్ చేసిన విధానం అయితే బాగుంది. కానీ కథ, ప్రజెంటేషన్ లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది…