Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi and top Telugu directors: చిరంజీవి తో సినిమా చేయకుండానే స్టార్ డైరెక్టర్స్ అయిన...

Chiranjeevi and top Telugu directors: చిరంజీవి తో సినిమా చేయకుండానే స్టార్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు వీళ్లేనా..?

Chiranjeevi and top Telugu directors: కొంతమంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తర్వాత టాప్ డైరెక్టర్లుగా మారిపోతారు. ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరు చిరంజీవితో సినిమా చేసిన తర్వాతే వాళ్ళకంటు ఒక స్టార్ డమ్ ఏర్పడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే 2000 సంవత్సరంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది దర్శకులు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయకుండానే స్టార్ డైరెక్టర్స్ గా మారిపోయారు. ఇంతకీ వారిలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన కెరియర్ స్టార్టింగ్ లో చిరంజీవితో సినిమా చేయాలని చాలా వరకు ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు. దాంతో ఆయనకు దొరికిన హీరోలతో సినిమాలను చేసి వాళ్ళని స్టార్ హీరోలుగా మార్చేశాడు…

ఇక పూరి జగన్నాధ్ సైతం కెరియర్ మొదటి నుంచి చిరంజీవితో సినిమా చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడు.కానీ అది వర్కౌట్ కాలేదు అయినప్పటికి ఆయన రవితేజ తో వరుస సినిమాలను చేసి స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక మహేష్ బాబుతో చేసిన పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడంతో ఆయన ఒక్కసారిగా నెంబర్ వన్ డైరెక్టర్ గా కూడా మారిపోయాడు…

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయిత గా తన కెరియర్ ను మొదలు పెట్టినప్పటికి దర్శకుడిగా మారిన తర్వాత ఆయన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లను ఎక్కువగా రిపీట్ చేస్తూ సినిమాలను చేశాడు.
చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా తను ఎందుకో ఆ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. చిరంజీవితో సినిమా చేయకుండా స్టార్ డైరెక్టర్ గా మారి టాప్ లిస్టులో కొనసాగుతున్న వాళ్లలో త్రివిక్రమ్ కూడా ఉంటాడు…

ఇక ఇప్పుడున్న కొంతమంది దర్శకులు చిరంజీవితో సినిమా చేయకుండానే టాప్ పొజిషన్ ని అందుకున్నారు. నిజానికి చిరంజీవితో సినిమా చేయాలనేది ప్రతి ఒక్క దర్శకుడు కల అది కొంతమందికి నెరవేరితే మరి కొంత మందికి అందని ద్రాక్ష గానే మిగిలిపోయిందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version