డ్రగ్స్ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధం ఉందా…?

సినిమాలకు, రాజకీయాలకు ఉండే అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి రెండు వేరువేరు అయినప్పటికీ వీటిని మనం వేరుగా చూడలేం. దశాబ్దాల కాలం నుంచే సినిమాలకు, రాజకీయాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ రెండూ వేరువేరు అని కొందరు చెప్పినా ఆ రంగాలకు చెందిన వారికి ఒక రంగంతో మరొక రంగానికి ఉన్న సన్నిహిత సంబంధాలు బాగా తెలుసు. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత ప్రస్తుతం దేశవ్యాప్తంగా డ్రగ్స్ […]

Written By: Kusuma Aggunna, Updated On : September 14, 2020 11:30 am
Follow us on

సినిమాలకు, రాజకీయాలకు ఉండే అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి రెండు వేరువేరు అయినప్పటికీ వీటిని మనం వేరుగా చూడలేం. దశాబ్దాల కాలం నుంచే సినిమాలకు, రాజకీయాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ రెండూ వేరువేరు అని కొందరు చెప్పినా ఆ రంగాలకు చెందిన వారికి ఒక రంగంతో మరొక రంగానికి ఉన్న సన్నిహిత సంబంధాలు బాగా తెలుసు.

అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత ప్రస్తుతం దేశవ్యాప్తంగా డ్రగ్స్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ముగురు ప్రముఖ హీరోయిన్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో సినీ అభిమానులు అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. తీగ లాగితే డొంకంతా కదులుతుందని మరి కొందరు ప్రముఖుల పేర్లు ఈ కేసుల్లో బయటకు రావడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉండటం గమనార్హం.

గత కొన్ని రోజులుగా హీరోయిన్లే డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాగా హీరోలు కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోలకు డ్రగ్స్ కేసుకు లింకులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కంగనా ఈ ఆరోపణలతో పాటు ఒక రాజకీయ నాయకుడికి డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కర్ణాటకలో డ్రగ్స్ కేసులో రాగిణి, సంజన అరెస్ట్ అయ్యారు. వారితో సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయా….? లేవా…? అనే ప్రశ్నాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతోనే నటీమణులకు డ్రగ్స్ తో సంబంధాలు ఏర్పడ్డాయని… అయితే వారి పేర్లు మాత్రం ఎందుకు బయటకు రావడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.