Aravinda Sametha Veera Raghava: ‘నువ్వే కావాలి’ సినిమాతో రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్…ఆ మూవీ తర్వాత ఆయన పలు సినిమాలకు కథ మాటలు అందిస్తూ ఆ సినిమాలను సూపర్ సక్సెస్ చేయడంలో కీలకపాత్ర వహించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ రైటర్ గా తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి రచయిత తర్వాత దర్శకుడిగా మారి భారీ సక్సెస్ ను సాధించాడు. ఇక తన నుంచి వచ్చే సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటెన్ చేస్తూ ఉంటాడు. అందువల్ల అతనికి గొప్ప సక్సెసు లైతే దక్కుతున్నాయి…ఆయన ఎంత మంచి రైటర్ అంటే మనలో ఎవరైనా ఒక డైలాగ్ బాగా రాస్తే చాలు అందరు త్రివిక్రమ్ లా చాలా బాగా రాశావు అని చెబుతుంటారు. అలాంటి రైటర్ కి ఒక నటుడు సీన్ విషయంలో సలహా ఇచ్చాడట. అతను ఇచ్చిన ఆ సజేషన్ సినిమాను సూపర్ సక్సెస్ చేసిందట. ఇంతకీ ఆ సలహా ఇచ్చిన నటుడు ఎవరు.?ఆయన ఇచ్చిన సలహా ఏంటి? అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు జగపతిబాబు…హీరోగా చాలా సంవత్సరాల పాటు రాణించిన ఆయన ఆ తర్వాత హీరోగా అవకాశాలు లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మారి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు…ఇక ఈ క్రమంలోనే త్రివిక్రమ్ వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ క్యారెక్టర్ అతనికి పునర్జన్మ ను ఇచ్చిందంటూ ఆయన పలు ఇంటర్వ్యూల్లో తెలియజేశాడు. ఇక దాంతో పాటుగా అరవింద సమేత సినిమా మొదట తీసిన క్లైమాక్స్ వేరని, ఈ సినిమా ఇప్పుడు మనం చూస్తున్న క్లైమాక్స్ వేరని చెప్పాడు.
మొదట దర్శకుడు ఒక భారీ ఫైట్ తో క్లైమాక్స్ ని ముగించాలని అనుకోని ఆ ఫైట్ సీక్వెన్స్ ను తీసాడట… దాంతో జగపతిబాబు అది చూసి ఏంటి శీను నీలాంటి క్రియేటివ్ డైరెక్టర్లు కూడా రొటీన్ పద్ధతిలోనే సినిమాలను తీస్తున్నారా? అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా రొటీన్ గా ఎండ్ చేస్తున్నావు అది నాకు నచ్చలేదు అని చెప్పారట.
అప్పటికే సినిమా క్లైమాక్స్ తేడా కొట్టేలా ఉంది అంటూ ఇటు త్రివిక్రమ్, అటు ప్రొడ్యూసర్స్ అయితే డిస్కషన్ చేసుకుంటున్నారట… ఇక దానికి తోడు జగపతిబాబు కూడా ఈ విషయాన్ని చెప్పడంతో వాళ్లు కొంతవరకు ఆలోచన పడ్డారట. దాంతో త్రివిక్రమ్ మరోసారి పెన్ను పట్టి క్లైమాక్స్ ను రిరైట్ చేశాడు. విలన్ చుట్టూ ఉన్న వాళ్ళందరు మారిపోవడంతో విలన్ ఒక్కడే హీరోని చంపడానికి బయలుదేరుతాడు.
ఇలా క్లైమాక్స్ ను ముగించి చివరిలో లేడీస్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ క్లైమాక్స్ ముగించారు. మొత్తానికైతే త్రివిక్రమ్ ఈ సినిమా క్లైమాక్స్ తో ప్రేక్షకుల హృదయాన్ని ఆకట్టుకున్నాడు. మొత్తానికైతే జగపతి బాబు చెప్పిన ఆ ఒక్క మాట వల్ల సినిమా రేంజ్ మారిపోయిందంటూ చాలామంది కామెంట్లు చేస్తుండటం విశేషం…